Movie News

గౌర్ నాయుడు ఏం చేయబోతున్నాడు

పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. ట్రైలర్ కూడా సిద్దమయ్యిందని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబుతో పాటు సుకుమార్ కూడా ఫైనల్ కట్ చూసి సంతృప్తి చెందాకే ఓకే అనుకున్నారట. రెండు మూడు వెర్షన్లు తయారు చేయించి బెస్ట్ అనిపించింది త్వరలోనే చిరంజీవికి చూపించబోతున్నట్టు వినికిడి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఇది కాదు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పల్లెటూరి డ్రామాలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గౌర్ నాయుడుగా ఈ క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుందట. సెకండాఫ్ లో ఈయన ఎంట్రీ ఇచ్చాక పెద్ది గ్రాఫ్ మారిపోతుందని, అప్పటిదాకా ఒకలా జరిగిన పెద్ది ప్రయాణం అమాంతం గేర్ మార్చుకుంటుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ కు ముందు ఈ ఇద్దరి కలయికలో వచ్చే ఒక ఎపిసోడ్ నెక్స్ట్ లెవెలనే స్థాయిలో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

గౌర్ నాయుడు కనక సరిగ్గా క్లిక్ అయితే పెద్దికి కర్ణాటకలో శివ రాజ్ కుమార్ ఫ్యాన్స్ అండ దొరుకుతుంది. ఎలాగూ చరణ్ కు అక్కడ బలమైన మార్కెట్ ఉంది కానీ ఇప్పుడీ పాత్ర తెచ్చే అదనపు మైలేజ్ డబ్బింగ్ సినిమాలకు దూరంగా ఉండే హార్డ్ కోర్ కన్నడ ఆడియన్స్ ని పెద్ది వైపు లాగుతుంది. రజనీకాంత్ జైలర్ విషయంలో ఇదే జరిగింది. కేవలం కొన్ని నిముషాలు కనిపించే శివన్న కోసం బెంగళూరు లాంటి నగరాల్లో రిపీట్ షోలు చూశారు ఫ్యాన్స్.

మెగాస్టార్ కుటుంబంతో రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నప్పటికీ కలిసి సినిమాలు చేసే ఛాన్స్ ఎప్పుడూ రాలేదు. శివరాజ్ కుమార్ సైతం కన్నడకే ప్రాధాన్యం ఇవ్వడంతో మన దర్శకులు కలిసినా కూడా ఎస్ చెప్పేవారు కాదు. గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణ కోసం ఒక బుర్రకథ పాటలో నర్తించారు. కానీ వీటితో ఏ మాత్రం సంబంధం లేని గౌర్ నాయుడుగా కొత్త శివన్నని చూడటం ఖాయమేనట. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం త్వరలో శివరాజ్ కుమార్ హైదరాబాద్ రాబోతున్నారట.

This post was last modified on May 5, 2026 5:43 pm

Share

Recent Posts

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

1 hour ago

పంజాబ్‌ చిత్కార యూనివ‌ర్సిటీలో ఏం జరుగుతుంది?

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న‌ చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…

2 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

2 hours ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

3 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

8 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

12 hours ago