గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస ఫ్లాపులు వరించాయి. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ కేవలం వారం నిడివిలో ప్రేక్షకులను పలకరించగా కంటెంట్, కలెక్షన్స్ రెండింటి పరంగా ఏ మేజిక్ చేయలేకపోయాయి. బడ్జెట్స్ తక్కువ కావడంతో నిర్మాతలకు నష్టాల భారం తగ్గడం, ఓటిటి డీల్స్ వల్ల మంచి డబ్బులు చేసుకోవడం విపరీతమైన డ్యామేజ్ జరగకుండా కాపాడాయి.. తాజాగా గాయపడ్డ సింహం వచ్చింది.
పేరుకు తరుణ్ భాస్కర్ హీరో అయినా శ్రీవిష్ణుకి తగిన ప్రాధాన్యం దక్కేలా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఆ పాత్రను డిజైన్ చేశాడు. అయితే కామెడీ, హారర్ మధ్య అది నలిగిపోవడంతో శ్రీవిష్ణు ఎంత నిలబెడదామని ట్రై చేసినా కొంత మేరకు మాత్రమే పనయ్యింది. పైగా పోరాట సింహం అంటూ దీని సీక్వెల్ లో శ్రీవిష్ణునే హీరోగా చేస్తాడని హింట్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే స్టోరీ నెరేషన్ టైంలోనే గాయపడ్డ సింహం తెగనచ్చేసి ఈ ఎక్స్ టెన్డెడ్ క్యామియో చేసినట్టు కనిపిస్తోంది.
ఫైనల్ గా శ్రీవిష్ణు ఖాతాలో మూడు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్ వస్తోంది. ఇది కూడా ఫన్ మూవీనే అంటున్నారు కానీ సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. నక్సలైట్ల నేపథ్యంలో శ్రీవిష్ణుని ఎలాంటి ట్రీట్ మెంట్ చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి నటిస్తారనే వార్త లీకయ్యింది కానీ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలోనే ఖరారు చేసే అవకాశాలున్నాయి.
నాలుగైదు సినిమాలు లైనప్ పెట్టుకున్న శ్రీవిష్ణు తిరిగి ట్రాక్ లో పడాలంటే బ్రోచేవారెవరురా లాంటి సరదా ప్లస్ కామెడీ థ్రిల్లర్స్ చేయాలి. తన టైమింగ్ ని సరిగ్గా వాడుకునే దర్శకులతో పని చేయాలి. ఏడాదికి ఒక మూవీ రిలీజ్ చేయడమే ఇతర హీరోలకు గగనమైపోతున్న టైంలో శ్రీవిష్ణు కనీసం రెండు మూడు రిలీజులు పెట్టుకోవడం మంచిదే. కాకపోతే క్వాలిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. హ్యాట్రిక్ ఫ్లాపులు నేర్పించేది ఇదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates