Movie News

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ సింహాసనం మీద కూర్చోవడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతల మీదకు వెళ్తోంది. జన నాయకుడు నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ కు పైరసీ, కంటెంట్ తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్ల వర్షం ఖాయమని ట్రేడ్ ముందస్తుగా అంచనా వేస్తోంది.

ఇక విజయ్ తో గతంలో సినిమాలు తీసిన ఇతర ప్రొడ్యూసర్లకు రీ రిలీజుల రూపంలో కాసుల వర్షం కురవనుంది. మాములుగానే తమిళనాట హీరోల పట్ల విపరీతమైన ఆరాధనా భావం ఉంటుంది. మన తెలుగు ఫ్యాన్స్ తో పోల్చుకుంటే వాళ్లదే ఎక్కువ. అందుకే గిల్లి రెండు దశాబ్దాల తర్వాత వచ్చినా కూడా ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది. శివకాశి, ఖుషి, లియో లాంటివి సందర్భం దొరికిన ప్రతిసారి థియేటర్లకు వచ్చి డబ్బులు చేసుకున్నాయి. ఆ మధ్య తేరి కూడా బాగానే ఆడింది.

ఇప్పుడు విజయ్ సిఎం అయ్యాక కొత్త సినిమాలు చేయడు గాక చేయడు. ఒకవేళ ఓడిపోయి ఉంటే రీ ఎంట్రీ ఇచ్చేవాడేమో కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. పూర్తిగా పాలన మీదే దృష్టి పెట్టాలి. బంగారం లాంటి అవకాశాన్ని వాడుకుని టీవీకే పార్టీని డిఎంకె, అన్నాడిఎంకె స్థాయిలో బలమైన పునాదులతో నిలబెట్టాలి. అయిదేళ్ల తర్వాత మళ్ళీ గెలిచినా గెలవకపోయినా టీవీకే బ్రాండ్ ని తమిళనాడులోని ప్రతి మూలకు తీసుకెళ్లాలి. విజయ్ లక్ష్యం నూటికి నూరు శాతం అదే.

సో థియేటర్లలో మిస్ అవుతున్న విజయ్ ని మళ్ళీ చూడాలంటే పాత సినిమాలు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్ గా డిస్టిబ్యూషన్ రేట్లు ఎక్కువ పలుకుతాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పాత సినిమాలు పంపిణీదారులకు కామధేనువుగా మారాయి. ఇప్పుడు విజయ్ కూడా ఈ ఫీట్ రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విజయ్ ఓటమిపాలైతే మళ్ళీ సినిమాలు తీద్దామని వెయిట్ చేసిన ఇతర ప్రొడ్యూసర్లకు మాత్రం నిరాశే మిగిలింది.

This post was last modified on May 4, 2026 6:01 pm

Share

Recent Posts

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

33 minutes ago

పంజాబ్‌ చిత్కార యూనివ‌ర్సిటీలో ఏం జరుగుతుంది?

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న‌ చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…

1 hour ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

1 hour ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

2 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

7 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

12 hours ago