JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జెడి చక్రవర్తి అంటే మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా తను వరుసగా సినిమాలు చేయడం లేదు. చాలా మంది దర్శక నిర్మాతలు తరచు కలుస్తూ ఉంటారు కానీ ఎస్ చెప్పిన దాఖలాలు పెద్దగా లేవు. అందకే గాయపడ్డ సింహం మీద జనంలో ఆసక్తి నెలకొంది.

తీరా చూస్తే ఫస్టాఫ్, సెకండాఫ్ లో అసలు పొంతన లేకుండా రెండు షేడ్స్ ని పెట్టిన విధానం జెడి మీద వర్కౌట్ కాలేదు. ఏదో సత్య రేంజ్ లో గ్యాంగ్ స్టర్ అంటూ హడావిడి చేసి తర్వాత భయస్తుడిగా, లేడీ డాక్టర్ మాయలో పడిపోయే ఏజ్ బార్ డాన్ గా చూపించడం ఏ మాత్రం సింక్ అవ్వలేదు. దీంతో ప్రేక్షకులు సరైన రీతిలో కనెక్ట్ కాలేకపోయారు. పైగా జెడికి పోటీగా అన్నట్టు శ్రీవిష్ణు పాత్రను డిజైన్ చేయడం లేనిపోని అయోమయాన్ని సృష్టించి పెట్టింది.

మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి టాప్ రేటెడ్ దర్శకులతో పని చేసిన జెడి ఇకపై రెగ్యులర్ గా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండాలి. ఇంత వయసు వచ్చినా మంచి జోష్ తో కనిపించే ఆయన్ని సరిగ్గా వాడుకుంటే కనక బ్లాక్ బస్టర్స్ లో భాగం చేయొచ్చు. గతంలో నక్షత్రం, హిప్పీ లాంటి తెలుగు సినిమాల్లో నటింపజేసినా అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. క్రమం తప్పకుండ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే సరైన టైంలో హిట్లు వచ్చి పడతాయి.

ఎన్నడూ లేనిది గాయపడ్డ సింహం కోసం జెడి చక్రవర్తి ప్రమోషన్లలో విపరీతంగా పాల్గొన్నారు. అయినా పనవ్వలేదు. వీకెండ్ కలెక్షన్లు కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ఫలితం ఏంటో తేటతెల్లం చేస్తోంది. ఆ మధ్య దయ అనే వెబ్ సిరీస్ లో మంచి క్యారెక్టర్ చేసిన జెడి ఇకపై అలాంటివి కొనసాగించాలి. ఇంటెన్స్, సీరియస్ నెస్ ఎక్కువగా ఉండే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. జగపతి బాబు తరహాలో బలమైన సెకండ్ ఇన్నింగ్స్ నిర్మించుకునే ఛాన్స్ జెడి లాంటి వెటరన్స్ కు ఉంటుంది.