తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో కాదు.. త్రిష. తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్‌తో త్రిష సన్నిహితంగా మెలగడమే అందుక్కారణం. తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డ విజయ్.. కొన్నేళ్ల నుంచి త్రిషతోనే కలిసి ఉంటున్నాడని స్పష్టమైంది.
ఎన్నికలు సమీపిస్తుండగా.. తమ గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ ఇద్దరూ ఒక పెళ్లి వేడుకకు కలిసి హాజరవడం ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఇక అప్పట్నుంచి విజయ్ ప్రస్థానంలో త్రిష పాత్ర ఎలా ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. కాగా ఈ రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే త్రిష తిరుమలలో ప్రత్యక్షం కావడంలో అందరి దృష్టీ అటు మళ్లింది.
విజయ్ కోసం శ్రీవారిని ప్రార్థించడానికే త్రిష తిరుమలకు వచ్చిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. కానీ ఇది నిజం కాదని ముందు నుంచి త్రిషను ఫాలో అవుతున్న వారికి అర్థమవుతుంది. మే 4న త్రిష పుట్టిన రోజు. తన ప్రతి బర్త్ డేకీ త్రిష తిరుమలకు వస్తుంది. ఈ విషయం తన అభిమానులకు తెలుసు.
ఐతే ఇప్పుడు యాదృచ్ఛికంగా త్రిష పుట్టిన రోజు నాడే మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తున్నారు. దీంతో చరిత్ర మరిచిపోయి విజయ్ కోసమే త్రిష తిరుమలకు వచ్చిందంటూ లింక్ పెట్టి మాట్లాడేస్తున్నారు. ఆమె వీడియోలను వైరల్ చేస్తున్నారు.
ఐతే విజయ్‌తో బంధం దృష్ట్యా అతను ఎన్నికల ఫలితాల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో త్రిష చాలా సంతోషంగా ఉండి ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ తన కోసమే తిరుమలకు వెళ్లిందని అబద్ధపు ప్రచారాలు చేయడం మాత్రం తప్పు. ఈ రోజు విజయ్ ప్రభావం చూపకపోయినా త్రిష తిరుమలకు వెళ్లేదన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates