పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలాతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవేవి టాలీవుడ్ గమనాన్ని మార్చిన మూవీస్ కాకపోవచ్చు కానీ ఫిలిం మేకర్ గా తన మీద రెస్పెక్ట్ అయితే తీసుకొచ్చాయి. కానీ ఇంత డీసెంట్ ట్రాక్ రికార్డు పెట్టుకుని నటన వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్న తరుణ్ భాస్కర్ గత మూడు నెలల్లో సోలో హీరోగా రెండుసార్లు థియేటర్లకు వచ్చాడు.
తాజాగా రిలీజైన గాయపడ్డ సింహం బాక్సాఫీస్ మందు కోసం పోరాడుతోంది. ఇంటా బయటా పబ్లిసిటీ హోరెత్తించినప్పటికీ అది వసూళ్లుగా మారడం లేదు. వీకెండ్ నెంబర్లు కూడా ఏమంత గొప్పగా లేకపోవడం నిర్మాతల కోణం నిరాశ కలిగించే విషయం. తరుణ్ భాస్కర్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోందనే పాయింట్ కు వస్తే ఆడియన్స్ లో తనకు నటుడిగా ఎలాంటి ఇమేజ్, మార్కెట్ లేదు. ఒక యాక్టర్ గా అతన్ని స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్న అభిమానులు ప్రత్యేకంగా లేరు.
అలాంటప్పుడు ఇంతేసి బడ్జెట్లతో తీస్తే వర్కౌట్ కావడం మాట అటుంచి వేరే రకమైన డ్యామేజ్ జరిగిపోతుంది. గాయపడ్డ సింహం ఇంకా నయం కానీ ఆ మధ్య వచ్చిన ఓం శాంతి శాంతి శాంతి మరీ దారుణంగా పోయింది. డాన్సులు కూడా ట్రై చేస్తున్న తరుణ్ భాస్కర్ తనకు సూట్ కాని ప్రయోగాలన్నీ చేస్తున్నాడని చెప్పొచ్చు. దర్శకుడిగా ఈ నగరానికి ఏమైంది 2 పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ టాలెంట్ తన బలహీనత కన్నా బలాన్ని ఎక్కువ గుర్తించాల్సిన అవసరం ఉంది.
ప్రాక్టికల్ గా ఇంకొన్ని విషయాలు చూద్దాం. అనిల్ రావిపూడిని దిల్ రాజుతో సహా చాలా మంది నువ్వు హీరో మెటీరియల్ అంటూ పొగుడుతూ ఉంటారు. ఒకవేళ వాటికి పొంగిపోయి తానా రిస్క్ చేస్తే ఏమవుతుందో అనిల్ కు బాగా తెలుసు. అందుకే దానికి దూరంగా కేవలం డైరెక్షన్ కే కట్టుబడి ప్రతి సంక్రాంతికి ఒక మూడు వందల కోట్ల గ్రాసర్ ఇస్తున్నాడు. తరుణ్ భాస్కర్ అలాంటి కమర్షియల్ బొమ్మలు తీయాల్సిన అవసరం లేదు. తన జానర్ లోనే దర్శకత్వ స్పీడ్ పెంచుకుంటే చాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates