ఒకప్పుడు సినిమా మొదలైనపుడే రిలీజ్ డేట్ ఇచ్చేవాళ్లు. ఆ డేట్‌కు కట్టుబడే సినిమాలను విడుదల చేసేవాళ్లు. కొన్ని సినిమాలు మేకింగ్ మధ్యలోకి వచ్చాక విడుదల తేదీని ఖరారు చేసుకునేవి. ఏ దశలో రిలీజ్ డేట్ ప్రకటించినా సరే.. దాన్ని అందుకోవడానికి కష్టపడేవారు. చాలా వరకు సినిమాలు చెప్పిన డేటుకే రిలీజయ్యేవి. ఒకటీ అరా సినిమాలు మాత్రమే డెడ్ లైన్ అందుకోలేకపోయేవి. బలమైన కారణాలుంటే తప్ప సినిమాలు వాయిదా పడేవి కావు. రిలీజ్ డేట్లను మార్చుకోవడాన్ని నెగెటివ్ సెంటిమెంటుగా చూసేవాళ్లు ఫిలిం మేకర్స్. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఇప్పుడు ఏదైనా సినిమా చెప్పిన డేటుకు రిలీజైతే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కరోనా టైంలో దాదాపుగా ప్రతి సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడంతో అది ఇండస్ట్రీలో మామూలు విషయం అయిపోయింది. ప్రేక్షకులు కూడా దీనికి అలవాటు పడిపోయారు. దీంతో ఇప్పుడు సరైన కారణాలు లేకుండానే సినిమాలను వాయిదా వేసేస్తున్నారు. షూటింగ్స్ విపరీతంగా ఆలస్యం అవుతున్నాయి. సినిమా రెడీ అయినా సరే.. ఏవేవో కారణాలతో వాయిదాలు తప్పట్లేదు.
గత కొన్ని రోజుల్లోనే బోలెడన్ని సినిమాల డేట్లు మారాయి. లెనిన్ సినిమా రిలీజ్ డేట్ మే 1 నుంచి జూన్ 26కు మార్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇంకోసారి వాయిదా అన్నారు కానీ.. అదేం లేదని క్లారిటీ వచ్చింది. మరోవైపు రామ్ చరణ్ మూవీ పెద్దిని మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి.. అక్కడ్నుంచి జూన్‌కు వాయిదా వేశారు. ఈ జూన్‌కు రావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్‌ను వచ్చే జూన్‌కు వాయిదా వేస్తూ ఇటీవలే ప్రకటన ఇచ్చారు. మరోవైపు యశ్ మూవీ టాక్సిక్‌కు ఇప్పటికే రెండు డేట్లు మార్చగా.. మళ్లీ వాయిదా పడింది. తాజాగా రిలీజ్‌కు రెడీగా ఉన్న సమంత సినిమా మా ఇంటి బంగారంను మే 15 నుంచి జూన్ 4కు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఒకట్రెండుసార్లు డేట్ మార్చుకున్న స్వయంభు సినిమా ఇప్పుడు కొత్తగా ఏ డేట్ ఎంచుకోవాలో అనే అయోమయంలో ఉంది. నాని సినిమా ది ప్యారడైజ్ కూడా రెండోసారి వాయిదా పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా గత కొన్ని రోజులుగా ఈ వాయిదా వార్తలతో తెలుగు ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఇలా ఎన్నిసార్లు డేట్లు మారుస్తారు… ప్రేక్షకులను ఇలా పదే పదే ఎందుకు నిరాశకు గురి చేస్తారు.. ఇదేం ప్లానింగ్ అంటూ సినీ ప్రియులు అసహనానికి గురవుతున్నారు.
This post was last modified on April 30, 2026 3:50 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…