యావరేజ్ అన్నారు… 200 కోట్లు వచ్చాయి

దురంధర్ ది రివెంజ్ ఊచకోత తర్వాత నిస్సత్తువగా మారిపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ కాసింత జోష్ కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ లేటెస్ట్ రిలీజ్ ‘భూత్ బంగ్లా’ మిక్స్డ్ రివ్యూస్, పబ్లిక్ టాక్ తోనూ రెండు వందల కోట్ల దాకా గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్. నెట్ లెక్కల్లో చూసుకుంటే 134 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు. యునానిమస్ అనిపించుకోని మూవీకి ఈ స్థాయి రెస్పాన్స్ అంటే పెద్ద విషయమే. ముఖ్యంగా నిన్న మొన్న వీకెండ్ భారీ వసూళ్లు వచ్చాయి.

అక్షయ్ కుమార్ – దర్శకుడు ప్రియదర్శన్ ది ఎంత విజయవంతమైన కలయికో మరోసారి భూత్ బంగ్లాతో ఋజువయ్యింది. కథా కథనాల ప్రకారం ఇది రొటీన్ లైన్ అయినప్పటికీ పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్ లాంటి ఆర్టిస్టుల టైమింగ్ వల్ల టైం పాస్ చేయించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఆడియన్స్ ఆదరణ దక్కుతోంది. దురంధర్ తో పోలిస్తే భూత్ బంగాళా నెంబర్లు చాలా తక్కువే అయినప్పటికీ డ్రైగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇది విజయం కిందే లెక్క.

కాకపోతే భూత్ బంగ్లా టీమ్ ఆశించింది వేరు. శ్రధ్ద కపూర్ స్త్రీ 2 స్థాయిలో రికార్డులు నమోదవుతాయని భావించారు. ఉన్నంతలో ఈ మాత్రం పెర్ఫార్మ్ చేయడం చాలా బెటరని చెప్పుకోవాలి. మ్యూజికల్ గా మరింత శ్రద్ధ వహించి పాటలు ఇచ్చి ఉంటే ఇంకా బాగా రీచ్ అయ్యేదన్న అభిప్రాయం మూవీ లవర్స్ లో వ్యక్తమవుతోంది. మూడు గంటలకు దగ్గరగా నిడివి ఉండటం ఇలాంటి హారర్ మూవీస్ కి అంతగా సెట్ కాదు. అయినా ప్రియదర్శన్ తగ్గలేదు.

మార్కెట్ కోణంలో అక్షయ్ కుమార్ కిది పెద్ద రిలీఫ్. గత కొన్నేళ్లుగా హిట్ల కన్నా ఎక్కువగా ఫ్లాపులు చవిచూస్తున్న టైంలో కనీసం ఒక రెండు మూడు సూపర్ హిట్లు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే భూత్ బంగ్లా కొంత స్వాంతన చేకూరింది. అక్షయ్ కుమార్ తో పాటు హీరోయిన్ వామికా గబ్బి కూడా ఇందులో డ్యూయల్ రోల్ చేయడం విశేషం. ఆ మధ్య సైయారాకు కూడా నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత బ్లాక్ బస్టరయ్యింది. భూత్ బంగ్లా అదే కోవలో చేరుతుందో లేదో చూడాలి.