Movie News

దిల్ రాజు భలే తప్పించుకున్నారే…

తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు ఇష్టపడరు. ఫెయిల్యూర్ల గురించి ఎక్కువ మాట్లాడితే.. ఆ చిత్రాల హీరోలతో తమ రిలేషన్ ఎక్కడ చెడుతుందో.. వారి అభిమానుల దృష్టిలో ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అని ప్రొడ్యూసర్లు భయపడుతుంటారు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

తాజాగా దిల్ రాజు సైతం ఇదే విషయంలో కాస్త భయపడి వెనక్కి తగ్గారు. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రాజు అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రశాంతి.. అతిథులందరినీ అడిగిన ప్రశ్ననే ఆయన్నీ అడిగారు. మీ జీవితంలో అతి పెద్ద గాయం చేసిన సినిమా ఏది అని అడిగితే.. దిల్ రాజు సూటిగా సమాధానం ఇవ్వలేదు.

సినిమా ఫ్లాప్ అయితే గాయం అవుతుంది, హిట్టయితే హ్యాపీ అని ఆయనన్నారు. ఫ్లాప్ అయిన ప్రతి సినిమా గాయమే అని రాజు పేర్కొనగా.. మీకు అలా తగిలిన అతి పెద్ద గాయం ఏది అని అడిగితే మాత్రం ఆయన జవాబివ్వలేదు. మీడియా వాళ్లను చూపిస్తూ.. నా మిత్రులు ఇక్కడే రెడీగా ఉన్నారు, నేను ఏ సినిమా పేరు చెబితే ఆ హీరోతో నాకు గొడవ పెట్టడానికి అంటూ గట్టిగా నవ్వేశారు రాజు.

తన కెరీర్లో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా పేరు చెబితే.. దాని మీద మీడియా వాళ్లు ఆర్టికల్స్ రాస్తే, ఆ హీరో ఫ్యాన్స్ తనను టార్గెట్ చేస్తారని రాజు భయపడ్డట్లున్నాడు. స్టేజ్ ఎక్కాం, మైక్ పట్టుకున్నాం కదా అనే ఉత్సాహంలో కొందరు తమకు ఏమనిపిస్తే అది మాట్లాడి సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోతుంటారు. కానీ రాజు మాత్రం చాలా తెలివిగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

This post was last modified on April 26, 2026 12:17 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago