గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. గురువారం రాత్రి బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ రిహానా ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోగ్రాఫర్లకు చిరునవ్వుతో గ్రీట్ చేస్తూ వెళ్తున్న ఆమె వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆమె ఇలా రావడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందని అర్థమవుతోంది.
అసలు విషయం ఏంటంటే, రిహానా ఈసారి మ్యూజిక్ షోల కోసం కాకుండా తన బిజినెస్ సామ్రాజ్యాన్ని ఇండియాలో విస్తరించడానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు చెందిన ఫేమస్ బ్యూటీ బ్రాండ్ ‘ఫెంటీ బ్యూటీ’ని ఇండియన్ మార్కెట్‌లోకి అధికారికంగా లాంచ్ చేయబోతున్నారట. ఏప్రిల్ 24న ముంబైలో ‘ఫెంటీ బ్యూటీ కి హవేలీ’ పేరుతో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ స్కిన్ టోన్స్‌కు తగ్గట్టుగా తన ప్రొడక్ట్స్‌ను ఇక్కడ ప్రమోట్ చేయడానికి రిహానా స్వయంగా రంగంలోకి దిగారు.
గతంలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం జామ్‌నగర్ వచ్చినప్పుడు రిహానా చేసిన సందడి అంతా ఇంతా కాదు. అది ఆమె మొదటి ఇండియా విజిట్. అప్పట్లో కేవలం పెర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్లిపోయిన ఆమె, దాదాపు రెండేళ్ల తర్వాత మళ్ళీ ముంబైలో కనిపించడం విశేషం. ఈసారి విజిట్ పూర్తిగా తన బ్రాండ్ ప్రమోషన్ల కోసమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమె టీమ్ నుండి దీనిపై ఇంకా అఫీషియల్ స్టేట్‌మెంట్ రావాల్సి ఉంది.
రిహానా మూడో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పబ్లిక్‌గా ఇలా కనిపిస్తున్న ఈవెంట్ కూడా ఇదే కావడం విశేషం. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూనే, 2026లో మళ్ళీ వరల్డ్ వైడ్ స్టేడియం షోలతో మ్యూజిక్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇండియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తన బ్యూటీ బ్రాండ్ ఇక్కడ సక్సెస్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సడన్‌గా ముంబైలో ల్యాండ్ అయ్యి తన ఫ్యాన్స్‌కు రిహానా గట్టి సర్ప్రైజ్ ఇచ్చారు.
మొత్తానికి రిహానా రాకతో ముంబైలో గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates