ప్రేమ కావాలంటే డార్లింగ్ జోరు తగ్గాలి

కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన స్పందన బయ్యర్లు నిజంగానే ఊహించలేదు. అప్పటికప్పుడు షోలు పెంచిన థియేటర్లు చాలా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి చోట్ల అభిమానులు చేసుకున్న సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. వీకెండ్ దాకా ఈ జోరు ఇలాగే ఉంటుందని, మురారి ఆరెంజ్ రికార్డులను టచ్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇదే వారం ఆది సాయికుమార్ ‘ప్రేమ కావాలి’ కూడా రీ రిలీజ్ అవుతోంది. ఆది కెరీర్ లో ఇది డెబ్యూ మాత్రమే కాదు బెస్ట్ మ్యూజికల్ హిట్ కూడా. అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మల్లేశ్వరి, మన్మథుడు లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ దీన్ని కూడా మంచి ఎంటర్ టైనర్ గా రూపొందించారు. సోషల్ మీడియాలో బన్నీ, చరణ్, మహేష్ ఫ్యాన్స్ మద్దతు ఇచ్చి స్పెషల్ షోలను సెలెబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

సమస్య ఏంటంటే ప్రభాస్ వైబ్ లో ఉన్న జనాలకు ఇప్పుడు ప్రేమ కావాలి ఎక్కాలంటే ముందు డార్లింగ్ స్పీడ్ తగ్గాలి. లేదంటే దాని మీద దృష్టి పడదు. ఎలాగూ మలయాళం డబ్బింగ్ వాలా 2 తప్ప మరో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడంతో ఈ వారం ప్రేమ కావాలికి మంచి ఛాన్స్ ఉంది. ఒకవేళ డార్లింగ్ లేకపోయి ఉంటే బెటర్ రన్ దక్కి ఉండేది కానీ టైమింగ్ మిస్సయ్యిందని చెప్పొచ్చు. ప్రభాస్ డామినేషన్ వల్ల ఆది సాయికుమార్ కొంచెం సైడ్ అవ్వాల్సి వచ్చింది.

ఇదంతా పక్కన పెడితే థియేటర్లు ఫీడింగ్ లేక కరువులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది గమనించే డెకాయిట్ టికెట్ రేట్లు తగ్గించి మళ్ళీ ప్రమోషన్లు మొదలుపెట్టింది. వచ్చే వారం గాయపడ్డ సింహం, జెట్లీ వస్తున్నా ఇంకా కామన్ ఆడియన్స్ కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. పబ్లిసిటీ జోరుగానే చేస్తున్నారు. ఓపెనింగ్స్ వచ్చినా రాకపోయినా టాక్ వస్తే చాలు ఆటోమేటిక్ గా జనాలను థియేటర్లలో చూడొచ్చు. కాకపోతే అది వీకెండ్ ముచ్చటగా కాకుండా లాంగ్ రన్ కు ఉపయోగపడాలి.