Movie News

‘చెడు’ చూపించకుంటే ‘మంచి’ బయోపిక్ ఎలా?

70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మైకేల్’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందే వరల్డ్ వైడ్ ప్రిమియర్స్ పడిపోయాయి. ఈ మధ్య కాలంలో వరల్డ్ వైడ్ విపరీతమైన హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇది ఒకటి. ఇండియాలో సైతం ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.

ఇక్కడి సూపర్ స్టార్ల సినిమాల తరహాలో దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. వీకెండ్లో ఈ చిత్రం వసూళ్ల మోత మోగించేలా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ ‘మైకేల్’కు బంపర్ ఓపెనింగ్స్ రాబోతున్నాయన్నది స్పష్టం. ఐతే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులకు రివ్యూల రూపంలో పెద్ద షాక్ తగిలింది. హాలీవుడ్ క్రిటిక్స్ అందరూ ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలే ఇచ్చారు. రోటన్ టమోటాస్ మరీ కనీసంగా 37 శాతం రేటింగ్ ఇచ్చింది ఈ సినిమాకు.

మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఈ సినిమాను కొనియాడుతున్నప్పటికీ.. క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాను ఏకిపడేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం.. మైకేల్ జీవితంలో ఒక పార్శ్యాన్ని మాత్రమే చూపించడమే. తన సంగీత ప్రయాణాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. తన మావయ్య పాత్రలో జాఫర్ జాక్సన్ జీవించేశాడు. మైకేల్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, డ్యాన్స్‌ మూమెంట్స్‌ను దించేశాడంటూ అతడి పెర్ఫామెన్స్‌ను కొనియాడుతున్నారు.

ఐతే మైకేల్‌ను ఒక ఉత్తముడిలా ప్రెజెంట్ చేశారు తప్పితే.. తన జీవితంలో ప్రతికూల కోణాల గురించి సినిమాలో చర్చే లేదు. ముఖ్యంగా చిన్నపిల్లల మీద లైంగిక వేధింపుల విషయంలో మైకేల్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇంకా తన జీవితంలో మరి కొన్ని ప్రతికూల కోణాలున్నాయి. కానీ దర్శకుడు వాటి జోలికే వెళ్లలేదు.

సెలబ్రెటీల జీవితాలను తెరపైకి తీసుకొచ్చినపుడు వివాదాస్పద అంశాలను, ప్రతికూల కోణాలను కూడా టచ్ చేస్తే, సమతూకం పాటిస్తేనే వాటికి పరిపూర్ణత వస్తుంది. కేవలం వాళ్లను గొప్పవాళ్లుగా మాత్రమే చూపించాలని చూస్తే, ఎలివేషన్ ఇచ్చుకోవాలని ప్రయత్నిస్తే అవి ప్రేక్షకులకు కిక్ ఇవ్వవు.

తెలుగులో ‘మహానటి’ సినిమా సావిత్రి జీవితంలో అన్ని కోణాలనూ చూపించడం వల్లే అంత పెద్ద సక్సెస్ అయింది. అదే సమయంలో ‘యన్.టి.ఆర్’ సినిమా ఎందుకు ఫెయిలైందో అందరికీ తెలుసు. ఇదే విషయం ‘మైకేల్’కు కూడా వర్తిస్తుంది. జాక్సన్‌ను ఒక సెయింట్‌లాగా చూపించారని, అతడి జీవితాన్ని శానిటైజ్ చేశారని క్రిటిక్స్ బయోపిక్ మీద వెటకారంగా రివ్యూలు ఇస్తున్నారు.

This post was last modified on April 23, 2026 4:19 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

3 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

4 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

5 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

6 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

6 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

8 hours ago