Movie News

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తాజాగా తమన్ వచ్చాడనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. తనతో త్రివిక్రమ్ బాండింగ్ గురించి మనకు తెలిసిందే. ‘అరవిందసమేత వీరరాఘవ’ నుంచి ఇది మరింత బలపడింది. అయితే వెంకటేష్ కోణంలో చూసుకుంటే తమన్ తీర్చాల్సిన ముఖ్యమైన బాకీ ఒకటుంది.

ఇప్పటిదాకా వెంకటేష్ – తమన్ కాంబోలో నాలుగు సినిమాలొచ్చాయి. గోపీచంద్ మలినేని ‘బాడీగార్డ్’ ఫ్లాప్ కాగా, మెహర్ రమేష్ ‘షాడో’తో పాటు రామ్ తో కలిసి నటించిన ‘మసాలా’ డిజాస్టర్లయ్యాయి. చైతు కాంబోలో చేసిన ‘వెంకీ మామ’ కొంచెం బెటర్. ఎబోవ్ యావరేజ్ మార్కు అందుకోగా ఈ కలయిక నుంచి ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ పడకపోవడమే విచిత్రం. బాలయ్య లాంటి సీనియర్ హీరోలకు అఖండ రూపంలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఒక్క వెంకీ విషయంలో కొంచెం వెనుకబడుతున్నాడు.

అయితే ఇప్పుడు లెక్క మారుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే డైరెక్షన్ చేస్తోంది త్రివిక్రమ్. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా కుర్చీ మడతపెట్టి పాట అందరినీ ఊపేసింది. అంతకు ముందు ‘అల వైకుంఠపురములో’ చేసిన మేజిక్ తెలిసిందే. సో ఈసారి బెస్ట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ట్యూన్స్ కంపోజింగ్ జరుగుతోంది. రికార్డింగ్ కాగానే వాటిని షూట్ చేసే షెడ్యూల్స్ ని ప్లాన్ చేయబోతున్నారు.

చేతిలో తక్కువ టైం ఉంది కాబట్టి తమన్ ఉన్న పరిమితుల్లోనే బెస్ట్ అవుట్ అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ విడుదల టార్గెట్ చేసుకున్న ఆదర్శ కుటుంబం షూటింగ్ జూలైలోపు అయిపోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే కనీసం దానికో నాలుగు నెలలు వెంకటేష్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పరుగులు పెట్టక తప్పదు. గాంధీ జయంతి అక్టోబర్ 2 ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఆదర్శ కుటుంబం డేట్. 

This post was last modified on April 23, 2026 2:10 pm

Share

Recent Posts

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 minutes ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

38 minutes ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

48 minutes ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

2 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

4 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

4 hours ago