ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ మూవీ సక్సెస్ కావాలి, అని అన్నారు.
పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ, వారి మధ్య ఉండే సరదా సంఘటనలు, స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. టీజర్‌లో కనిపించిన ఎనర్జీ, ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
సంగీతాన్ని అజయ్ అరసాడ అందించగా, విజువల్స్‌కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. టెక్నికల్ టీమ్ పని కూడా ప్రశంసనీయంగా కనిపిస్తోంది.
టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. వినోదంతో పాటు కొత్తదనం చూపించబోతున్న ఎంఆర్పీ సినిమా నుంచి త్వరలో మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.
నటి నటులు:
నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, డొనాల్ బిష్త్, వెన్నెల కిషోర్,హర్షవర్ధన్,గగన్ విహారి తదితరులు
టెక్నికల్ టీం:
డైరెక్టర్ & ప్రొడ్యూసర్ : శ్రవణ్ జేష్ఠ
బ్యానర్ : పాంచజన్య ఫీచర్స్
మ్యూజిక్ : అజయ్ అరసాడ
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
డీ ఓ పీ : రాకేష్ కొలంచి
మార్కెటింగ్ : కీ మీడియా
పీ అర్ ఓ : దినేష్ కోయ
This post was last modified on April 22, 2026 1:27 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…