బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో పెట్టిన డబ్బులకు కోరుకున్న వినోదం దక్కిందా లేదాని మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. అయితే వీడియోల రూపం తెరవెనుక జరిగింది చూపించడం ఆసక్తికరంగానే ఉంటుంది. ఫిలిం మేకింగ్ మీద ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కాకపోతే వాటిని యూట్యూబ్, ఓటిటిలో అయితేనే ఎక్కువ ఇష్టపడతారు.
దీన్ని బ్రేక్ చేసే ఉద్దేశంతో గతంలో ఆర్ఆర్ఆర్ మేకింగ్ ని థియేటర్లలో విడుదల చేశారు. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కానీ జనాలు లైట్ తీసుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఎగబడి చూడలేదు. కారణం సింపుల్. ఎలాగూ డిజిటల్ వచ్చేదానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చూడాలనే ఉద్దేశంతో మానుకున్నారు. వాళ్ళు ఊహించినట్టే తక్కువ గ్యాప్ లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది.
ఇప్పుడు దురంధర్ మేకింగ్ ని డాక్యుమెంటరీ రూపంలో థియేటర్ రిలీజ్ చేసే ప్లాన్ లో జియో స్టూడియోస్ ఉన్నట్టు ముంబై సమాచారం. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే రాజమౌళి వల్ల కానిది ఆదిత్య ధార్ ప్రూవ్ చేయగలడా అని. ఎందుకంటే పాకిస్థాన్ లియారి ప్రాంతాన్ని సెట్ వేసి దురంధర్ తీశారంటే చాలా మందికి నమ్మశక్యం అనిపించలేదు. కానీ అదే నిజం. పాక్ లో అనుమతులు దొరకవు కాబట్టి థాయిలాండ్ లో వేసి చిత్రీకరించారు.
ఒకరకంగా చెప్పాలంటే మూవీ లవర్స్ కి లియారి ప్రపంచాన్ని ఎలా సృష్టించారో తెలుసుకోవాలని ఉంటుంది. కాకపోతే డబ్బులు పెట్టి చూస్తారా అంటే ప్రస్తుతానికి డౌట్ గానే చూడాలి. వచ్చే జూన్ మొదటి వారంలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతున్న దురంధర్ రివెంజ్ ఇప్పటికీ వసూళ్లు రాబడుతోంది. వీకెండ్ వస్తే చాలు మెయిన్ సెంటర్స్ లో షేర్లు దక్కుతున్నాయి. చాలా చోట్ల కొత్త సినిమాల కన్నా ఇదే మెరుగ్గా ఉండటం గమనించాల్సిన విషయం. మేకింగ్ ఏం చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates