మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్ చేయలేరనే అంచనాను పూర్తి తల్లకిందులు చేస్తూ దురంధర్ ది రివెంజ్ ఆ లాంఛనాన్ని సగర్వంగా పూర్తి చేసింది. ట్రేడ్ సమాచారం మేరకు దురంధర్ ది రివెంజ్ 1743 కోట్లతో టాప్ 3 ఇండియన్ సినిమా కిరీటాన్ని స్వంతం చేసుకోగా రెండో స్థానంలో బాహుబలి 2 ది కంక్లూజన్ (1789 కోట్లు), మొదటి ప్లేసులో దంగల్ (2070 కోట్లు) తమ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తున్నాయి.
బన్నీ మూవీ నాలుగో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి పది రోజుల నుంచి వీక్ డేస్ ఆక్యుపెన్సీలు దురంధర్ 2కి తగ్గిపోయాయి. ఐపీఎల్ మ్యాచులు, ఎండలు కొంచెం ప్రభావం చూపించాయని అనుకున్నా దురంధర్ 1తో పోలిస్తే ఇందులో రిపీట్ వేల్యూ తక్కువగా ఉందనే ప్రేక్షకుల ఫీలింగ్ వసూళ్లని కొంచెం ఎఫెక్టయ్యేలా చేసింది. అయినా సరే మొదటి భాగాన్ని పెద్ద మార్జిన్ తో దాటేసిన దురంధర్ ది రివెంజ్ త్వరలోనే బాహుబలి 2ని వెనక్కు నెట్టడం ఖాయమే.
నాలుగు గంటల నిడివితో పాటు ఫాంటసీ, విఎఫ్ఎక్స్ లేని ఒక స్పై డ్రామా ఇంత పెద్ద విజయం సాధించడం బాలీవుడ్ చరిత్రలో కొత్త చాప్టర్ రాసుకునేలా చేసింది. గూఢచారి సినిమాలను ఓవర్ ది టాప్ హీరోయిజంతో చూపించడం అలవాటు చేసిన మేకర్స్ కి చెంపపెట్టులా దురంధర్ ఒక కొత్త మార్గాన్ని చూపించింది. దీని దెబ్బకే నిర్మాణంలో ఉన్న ఇతర స్పై సినిమాలు తమ స్క్రిప్టులు, మేకింగులు మార్చుకోవడం అబద్దం కాదు.
ఇప్పుడు అందరి దృష్టి దురంధర్ ది రివెంజ్ రెండు వేల కోట్ల మైలురాయిని అందుకుంటుందా లేదానే దాని మీద ఉంది. ఒకవేళ దుబాయ్ తదితర దేశాల్లో నిషేదానికి గురి కాకుండా ఉంటే ఈ ఫీట్ సులభంగా సాధ్యమయ్యేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. చైనా, జపాన్ లో ఇలాంటివి పెద్దగా ఆడవు. సో అక్కడ రిలీజ్ చేస్తే ఏదైనా అద్భుతాలు జరగడం అనుమానమే. హాట్ స్టార్ లో వచ్చే నెల స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న దురంధర్ ది రివెంజ్ ఏం చేసినా ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి చేసేయాలి.
This post was last modified on April 19, 2026 5:44 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…