రాకా కోసం బన్నీ రేయింబవళ్ల కష్టం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా గురించి ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద చర్చే జరుగుతోంది. మాములుగా పుష్ప 2 లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక స్టార్ హీరోలు సేఫ్ గేమ్ ఆడతారు. తక్కువ టైంలో ఎక్కువ బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్లతో పాటు రిస్క్ లేని కథలను ఎంచుకుంటారు. దీని వల్ల ఆదాయంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందనే నమ్మకం. కానీ బన్నీ అలాంటి లెక్కలేవీ వేసుకోకుండా రాకాకు ఓకే చెప్పాడు.

ఇటీవలే విడుదల చేసిన లుక్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ తరహా షాకింగ్ లుక్స్ రాకాలో ఇంకా ఉన్నాయట. ఇటీవలే మనం చూసిన లుక్ కోసం రోజు మూడు నుంచి నాలుగు గంటల సమయం కేవలం మేకప్ కోసమే కేటాయిస్తున్నారంటే బన్నీ డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ ఫర్మేషన్ తన ప్రణాళికలో నిజాయితిని బయట పెడుతోంది.

విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా రాకాకు విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సర్కిల్స్ లో నువ్వా నేనాని పోటీ పడుతున్నారు. పుష్పతో హిందీ ఆడియన్స్ లోనూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన అల్లు అర్జున్ ఇపుడీ రాకాతో వాటిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాడని దగ్గరివాళ్లు చెబుతున్న మాట. ఆర్య నుంచి రాకా దాకా లుక్స్ విషయంలో శ్రద్ధ తీసుకునే బన్నీ ఇప్పుడీ రాకాకు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు.

ఇప్పుడప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ముందైతే షూటింగ్ పూర్తవ్వాలి. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరమయ్యేలా ఉంది. 2027 వేసవి టార్గెట్ అంటున్నారు కానీ అప్పటికైనా గ్యారెంటీగా వస్తుందో లేదో దర్శకుడు అట్లీ మీద ఆధారపడి ఉంటుంది. సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ క్వాలిటీ కోసం ఇంతగా పరితపించిపోతున్న రాకా తన కెరీర్ బెస్ట్ అవ్వాలనే సంకల్పంతో వర్క్ చేస్తున్నాడు బన్నీ.