డెకాయిట్ ఇంకో ఇన్నింగ్స్ ఆడొచ్చు

అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్ తన బ్రాండ్ ఏంటో చూపించాడు. నెగటివ్ రెస్పాన్స్ రాకపోయినా టీమ్ చెప్పుకున్నంత గొప్పగా సినిమా లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగానే కనిపించాయి. అయినా సరే ఒకసారి చూద్దాం, అందులోనూ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ కాబట్టి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు బాగానే ఉన్నారు. ఇప్పుడు కొత్త వీకెండ్ రాబోతోంది.

చూస్తుంటే డెకాయిట్ ఇంకో ఛాన్స్ దొరకబుచ్చుకునేలా ఉంది. ఎందుకంటే కొత్త రిలీజుల పట్ల ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ మరీ ఎక్కువ స్థాయిలో లేదు. తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లు బాగా చేశారు. వారం రోజలు జనం దృష్టిలో పడేందుకు పడిన కష్టం సోషల్ మీడియాలో బజ్ తీసుకొచ్చింది. అయినా సరే హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే బుకింగ్స్ కనిపిస్తున్నాయి. కింది స్థాయి బిసి సెంటర్స్ లో వీలైనంత వేగంగా పికప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిర్మాత కిరణ్ అబ్బవరం అంచనా ప్రకారం ఆదివారం కల్లా వేగం అందుకుంటే థియేటర్ బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోతుంది. టాక్ యునానిమస్ గా లేకపోయినా ప్రయత్నంలో నిజాయితీ ఉందనే మాట బయటికి రావడంతో అది ఎంత మేరకు వసూళ్లకు దోహదం చేస్తుందో చూడాలి. ఇక పాపం ప్రతాప్ కూడా చాలా హడావిడి చేశారు. కానీ టాక్స్ కొంచెం టెన్షన్ పెట్టేలా ఉన్నాయి. తిరువీర్ ఫైనల్ గా హిట్టు కొట్టాడా లేక ఎదురుచూపులు తప్పవానేది ఇంకో రెండు రోజుల్లో తేలిపోవచ్చు.

బ్యాడ్ బాయ్ కార్తీక్, పళ్ళి చట్టంబిలు ఓపెనింగ్స్ కోసం పోరాడుతున్నాయి. టాక్ పెరగడం అటుంచి అసలు వచ్చిన సంగతే జనాలకు పెద్దగా తెలియలేదు. ఇవన్నీ చూసుకుంటే డెకాయిట్ కు మరో వారాంతం కలిసి వచ్చేలా ఉంది. పైన చెప్పినవి వసూళ్లు రాబట్టే పనిలో ఉన్నా మరీ మేజిక్ జరగకపోవచ్చు. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్ లో డెకాయిట్ కొత్త ఇన్నింగ్స్ ఆడొచ్చు. అందుకే అడివి శేష్ ప్రమోషన్లు ఆపకుండా కొనసాగిస్తున్నాడు. పక్క రాష్ట్రం కర్ణాటక కూడా వెళ్ళిపోయాడు.