Movie News

నిర్మాతను ఆదుకోబోతున్న స్టార్ హీరో

తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్‌తో సినిమా అంటే జాక్‌పాట్‌లా ఫీలవుతారు ఏ నిర్మాత అయినా. అందులోనూ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన చివరి సినిమాను నిర్మించే అవకాశం అంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఈ ఛాన్స్ దక్కించుకున్న కన్నడ నిర్మాత నారాయణను చూసి కోలీవుడ్ ప్రొడ్యూసర్లు అసూయ చెందే ఉంటారు. కానీ చివరికి చూస్తే.. ఈ సినిమాను ఎందుకు ప్రొడ్యూస్ చేశాన్రా నాయనా అని నారాయణ తల బాదుకునే పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇక తమిళనాట ఎన్నికల తర్వాతే రిలీజ్ అనుకుంటుండగా.. ఈ సినిమా ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లగా.. తాజా పరిణామంతో నిర్మాత పూర్తిగా అన్యాయం అయిపోయిన పరిస్థితి. రూ.500 కోట్ల బిజినెస్ టార్గెట్ అనుకుంటే.. ఇప్పుడు సగానికి సగం కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ఆలస్యం కావడం వల్ల పడ్డ వడ్డీల భారం ఒకవైపు.. ఇటు బయ్యర్లు, అటు ఓటీటీ, శాటిలైట్ సంస్థలు ముందు అనుకున్న రేటు కంటే బాగా తగ్గించబోతుండడం వల్ల జరిగే నష్టం ఇంకో వైపు. ఇలా నిర్మాత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.

‘జననాయగన్’ బడ్జెట్ రూ.400 కోట్లు కాగా.. అందులో సగం కంటే ఎక్కువ విజయ్ పారితోషకం కిందే పోయినట్లు సమాచారం. విజయ్‌కి అంత ఇచ్చినా సరే.. ఈ సినిమా ద్వారా నారాయణ వంద కోట్ల దాకా లాభం అందుకుంటాడని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వంద కోట్లకు తక్కువ కాకుండా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది.

ఒక సినిమా ద్వారా ఇంత లాస్ అంటే ఏ నిర్మాత అయినా ఎలా కోలుకుంటాడు? అందుకే విజయ్ ప్రొడ్యూసర్‌ను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన పారితోషకంలో సగం, అంతకంటే ఎక్కువ ఆయన వెనక్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. విజయ్ ‘జననాయగన్’ను తన పొలిటికల్ ఐడియాలజీ చెప్పడానికి ఒక వేదికగా మలుచుకున్నాడు. 

ఎన్నికల ముంగిట ఇది అతడి మాస్టర్ స్ట్రోక్ అనుకున్నారు. కానీ రాజకీయ అంశాలు ఉండడం వల్లే ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు తలెత్తాయి. కాబట్టి ఇప్పుడీ పరిస్థితికి బాధ్యత వహించాల్సింది విజయే. అందుకే అతను నిర్మాతను ఆదుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

విజయ్ సినిమాల్లో కొనసాగేట్లు ఉంటే నారాయణతో ఇంకో సినిమా చేయడానికి కూడా రెడీయే కానీ.. ప్రస్తుతానికి సినిమాలకు సెలవు అనే అంటున్నాడు. కాబట్టి పారితోషకం వెనక్కి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక మళ్లీ సినిమాలు చేయాలనుకుంటే మాత్రం రీఎంట్రీలో తొలి చిత్రాన్ని నారాయణకే చేసే అవకాశలున్నాయి.

This post was last modified on April 14, 2026 8:55 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

54 minutes ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

8 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

9 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

9 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

9 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago