Movie News

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే అయినప్పటికీ ఇండియా వైడ్ పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో నిర్మాత వెంకట్ కె నారాయణ కంకణం కట్టుకున్నారు. ఒకేసారి నాలుగైదు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు ప్లాన్ చేసుకున్నారు. మొదటి రెండు కన్నడ సినిమాలు సకత్, బై టూ లవ్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తర్వాత ‘కెడి ది డెవిల్’తో భారీ బడ్జెట్లతో ప్రొడక్షన్ గేర్ మార్చేశారు.

రెండేళ్లు దాటిపోయినా కెడి ది డెవిల్ విడుదల కాలేదు. కొన్ని వారాల క్రితం ఏప్రిల్ 30 అని ప్రకటించారు కానీ ఎంత వరకు మాట మీద ఉంటారో చెప్పలేం. ధృవ సర్జ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. యష్ ‘టాక్సిక్’ గురించి తెలిసిందే. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఏకంగా జూన్ కు వెళ్ళిపోయింది. అప్పుడైనా మాట మీద ఉంటుందన్న గ్యారెంటీ లేదని బెంగళూరు వర్గాల టాక్.

ఇక ‘జన నాయకుడు’ గురించి తెలిసిందే. సెన్సార్ కాంట్రవర్సీతో మొదలుపెట్టి ఫుల్ మూవీ హెచ్డి లీక్ దాకా ఈ సినిమా పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. తమిళనాడు ఎన్నికలు కాగానే రిలీజ్ చేస్తారు కానీ ఆశించిన కలెక్షన్లలో సగం వస్తే గొప్పనేలా పరిస్థితి మారిపోయింది. మలయాళం హిట్ ఒప్పంని హిందీలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ తో ‘హైవాన్’గా రీమేక్ చేశారు. ఇదీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మలయాళ డెబ్యూ ‘బాలన్ ది బాయ్’ మోక్షం కోసం ఎదురు చూస్తోంది.

వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి 158 ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. జన నాయకుడు టెన్షన్లలో ఉన్న కెవిఎన్ మేకర్స్ అనుకున్న టైంకి దీన్ని స్టార్ట్ చేయలేదు. ఒకేసారి ఇన్నేసి సమస్యలు చుట్టుముడితే ఎవరికైనా తట్టుకోవడం కష్టం. ఒకప్పుడు శాండల్ వుడ్  డిస్ట్రిబ్యూషన్ లో తిరుగులేని చక్రం తిప్పిన కెవిఎన్ నెట్ వర్క్ ఇప్పుడు ప్రొడక్షన్ లో ఆపసోపాలు పడుతోంది.

ఇవన్నీ 2026లోనే పరిష్కారం అయిపోవాలి. ఎలా చూసుకున్నా పైన చెప్పిన సినిమాల మీద మొత్తం పెట్టుబడులు, బిజినెస్ సుమారు పదిహేను వందల కోట్ల దాకా ఉంటాయి. ఇంత మొత్తాన్ని రిస్క్ లో పెట్టి ప్రతి మూవీకి ఏదో ఒక చిక్కు అనుభవిస్తున్న వెంకట్ ఒత్తిడిని ఊహించుకోవడం కష్టమే. ఒక్క జన నాయకుడు బయటికి వచ్చి థియేటర్లలో అడుగుపెడితే  చాలు కొండంత బలం వస్తుంది. రాబోయే రెండు మూడు నెలలు ఈ అగ్ర నిర్మాణ సంస్థకు పెద్ద సవాళ్లు విసరబోతున్నాయి.

This post was last modified on April 13, 2026 2:34 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

4 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

5 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

6 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

7 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

7 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

9 hours ago