Movie News

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో క్లిప్పులు షేర్ చేసిన వాళ్లకు ఎలాంటి శిక్షలు ఉంటాయో స్పష్టంగా చెప్పేయడంతో ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేసినవాళ్లు సైలెంట్ గా డిలీట్ చేస్తున్నారు. దొంగతనంగా ప్రింట్ చూసి రివ్యూలు పెట్టిన వాళ్లపై సైతం చర్యలు తీసుకునే దిశగా లీగల్ టీమ్ పని చేస్తోంది. ఏది ఏమైనా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిన వాస్తవం.

లీక్ వల్ల ఓటిటి రేట్ సగానికి పైగా పడిపోయిందని చెన్నై టాక్. థియేటర్ బిజినెస్ కూడా ముందు అనుకున్న రేట్ ఇవ్వడం అసాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు తేల్చి చెప్పేస్తున్నారట. కంటెంట్ ఎలా ఉండబోతోందో ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి దానికి అనుగుణంగా తగ్గించమని కోరుతున్నారట. జనవరిలో వచ్చిన ఆఫర్లకు ఇప్పటికీ సగానికి పైగా వ్యత్యాసం ఉన్నా ఆశ్చర్యం లేదు. ముందైతే సెన్సార్ సర్టిఫికెట్ కోసం కెవిఎన్ బృందం పరుగులు పెడుతోంది.

సరే జరిగిందేదో జరిగిపోయింది. ఎన్నికల తర్వాత ఎలాగూ జన నాయకుడు థియేటర్లకు వస్తాడు. నెక్స్ట్ విజయ్ చేయబోయేది ఏంటనే చర్చ తమిళ సినీ వర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే కనక మొదటి సినిమా మీకే చేస్తానని కెవిఎన్ నిర్మాతకు విజయ్ హామీ ఇచ్చాడట. సెన్సార్ వివాదంతో మొదలుపెట్టి లీకుల దాకా విపరీతంగా నష్టపోయిన ప్రొడక్షన్ హౌస్ కి ఇప్పుడీ చేయూత చాలా అవసరం.

ఎలా చూసుకున్నా జన నాయకుడు తమిళనాడు ఎన్నికల కన్నా ముందు విడుదల కావడం జరగని పని. పోలింగ్ అయిపోయిన వెంటనే రిలీజ్ చేసుకోవచ్చు కనక ఏప్రిల్ 24 నుంచి ఏ డేట్ కైనా ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టేస్తుంది. అయితే సెన్సార్ చెప్పిన అభ్యంతరాలు, కట్స్ అన్నీ పోను చివరికి ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భగవంత్ కేసరికి రీమేక్. కొన్ని కీలక మార్పులు అయితే చేశారు.

This post was last modified on April 12, 2026 10:33 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

1 hour ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago