హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు రూపంలో వరుస హిట్లు పడ్డాయి. తర్వాత మొదలయ్యింది డిజాస్టర్ల పర్వం. ఒకదాని వెంట మరొకటి అప్పటిదాకా ఆయా హీరోల కెరీర్లలో చూడనంత పెద్ద ఫ్లాపులు కృతితో పడ్డాయి. వాటికి తను కారణం కాదు. కాకపోతే బ్యాడ్ లక్ వల్ల ఆ అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంలోనూ ఇది రిపీట్ అవుతోంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ లతో హ్యాట్రిక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ కు తొలి ఫ్లాప్ నమోదయ్యే దిశగా ఈ మూవీ థియేటర్ రన్ మెల్లగా తగ్గుతోంది. వీకెండ్ వల్ల తమిళంలో కాస్త మెరుగ్గా, తెలుగులో అంతంత మాత్రంగా ఉన్న వసూళ్లు సోమవారం నుంచి ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. దర్శకుడు విగ్నేష్ శివన్ పట్టువదలకుండా థియేటర్ ట్రిప్పులు కొడుతూనే ఉన్నారు.
2040లో జరిగిన లవ్ స్టోరీగా చూపించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ అంశమూ ఎక్కువ పాజిటివ్ గా లేకపోవడం నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేలా చేసింది. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే పెర్ఫార్మన్స్ పరంగా కొంత స్కోప్ దక్కినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో షో కేస్ చేసే ఛాన్స్ దర్శకుడు ఇవ్వలేదు. ఇదే ఏడాది జనవరిలో కార్తీతో చేసిన అన్నగారు వస్తారు సైతం కృతి శెట్టి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ట్రాజెడీ ఏంటంటే తెలుగు వెర్షన్ నేరుగా ఓటిటిలో వచ్చేయడం.
నెక్స్ట్ కృతి శెట్టి నుంచి వస్తున్న సినిమా జీనీ. జయం రవి హీరోగా రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా చాలా కాలంగా ల్యాబ్ లో మగ్గుతోంది. బిజినెస్, ఓటిటి లాంటి కారణాల వల్ల మోక్షం దక్కడం లేదు. ప్రీ రిలీజ్ వైబ్ చూస్తుంటే కాస్త అనుమానంగానే ఉంది కానీ స్క్రీన్ మీద ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి. నితిన్, రామ్, నాగచైతన్య, శర్వానంద్ లాంటి నోటెడ్ హీరోలతో నటించినప్పటికీ కోరుకున్న విజయలక్ష్మి మాత్రం కృతి శెట్టికి ఆమడ దూరంలో ఉండిపోతోంది. ఎప్పటికి మోక్షం దక్కుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates