టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు పెట్టకుండా చాలా నెమ్మదిగా అడుగులు వేయడం గొప్ప ఫలితాలు ఇస్తోంది. గూఢచారి, క్షణం, ఎవరు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తో హిట్టు కొట్టినవి. హిట్ 2 ది సెకండ్ కేస్ కేవలం పెద్దల కోసమే తీసినా అది కూడా విజయం సాధించింది. తాజాగా డెకాయిట్ వచ్చింది. కానీ దీని కేసు వేరు. పబ్లిక్ టాక్, రివ్యూస్ కొంత మిశ్రమంగా వచ్చాయి.
అయితేనేం జనాల్లో అడివి శేష్ సృష్టించుకున్న బేస్ మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ట్రేడ్ టాక్ ప్రకారం మొదటి రోజు సుమారు పది నుంచి పదిహేను కోట్ల మధ్య గ్రాస్ వసూలయ్యింది. ఇది పెద్ద నెంబరే. యునానిమస్ అనిపించున్నవి ఇలా వసూలు చేస్తే ఆశ్చర్యం లేదు కానీ డెకాయిట్ కొచ్చిన మిక్స్డ్ టాక్ తో పోల్చుకుని చూస్తే ఇక్కడ ఎవరి బ్రాండ్ పని చేసిందో అర్థమవుతుంది. అడివి శేష్ ఉన్నాడు కదా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చని జనాలు థియేటర్లకు వెళ్తున్నారు.
శేష్ కాకుండా డెకాయిట్ లో ఉన్న మరో క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం, హాయ్ నాన్నతో కుటుంబ ప్రేక్షకుల్లో సంపాదించుకున్న ఇమేజ్ ఇప్పుడు మరోసారి పని చేస్తోంది. ఈ జంట కోసమే థియేటర్లకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. వీకెండ్ ఇప్పుడీ మూవీకి చాలా కీలకం కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారం దాకా ఈ జోరు ఇలాగే కొనసాగుతుంది కానీ ఆపై మండే నుంచి అసలు ఛాలెంజ్ ఉంటుంద్. డ్రాప్ లేకుండా చూసుకోవాలి
ఫైనల్ గా చెప్పాలంటే అడివి శేష్ మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరోగా మారిపోతున్నాడు. ఈసారి క్రైమ్, యాక్షన్ జోలికి పోకుండా లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఒక కూల్ ఎంటర్ టైనర్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. డెకాయిట్ కలెక్షన్లు చూసి ట్రేడ్ ప్రస్తుతానికి హ్యాపీగానే ఉంది. కాకపోతే సోమవారం నుంచి హోల్డ్ ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. అపోజిషన్ లో ఉన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్లాప్ టాక్ రావడం డెకాయిట్ ఎంతమేరకు వాడుకుంటుందనేది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates