ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. అన్ని చోట్ల ఓపెన్ అయ్యాక ట్రెండింగ్ ఏ స్థాయిలో ఉందనేది క్లారిటీ వస్తుంది. అయితే ట్రైలర్ వచ్చాక డెకాయిట్ సౌండ్ కొంచెం తగ్గిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కథని రివీల్ చేసినప్పటికీ ఫాస్ట్ గా కట్ చేసిన విధానం మాస్ కు అంతగా రీచ్ కాలేదన్నది నెటిజెన్స్ టాక్.
డెకాయిట్ మీద ముందు నుంచి మంచి యాక్షన్, ఛేజింగ్ సినిమానే అంచనాలు ఆడియన్స్ లో బలంగా ఉన్నాయి. అయితే కొత్తగా లవ్ స్టోరీ యాంగిల్ లో ప్రమోట్ చేయడంతో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వైనం కనిపిస్తోంది. డెకాయిట్ కి ఈ వారం మంచి అవకాశం ఉంది. బైకర్, రాకాసలు డీసెంట్ టాక్ తో కొంత మేర నెట్టుకొస్తున్నాయి కానీ ఎక్స్ ట్రాడినరి టాక్ రాకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేస్తోంది. దీన్ని డెకాయిట్ పూర్తిగా వాడుకోవాలి.
అడివి శేష్ మీద ఉన్న నమ్మకం ఓపెనింగ్స్ కి దోహదపడుతుంది. హిట్ 2 ది సెకండ్ కేస్ తర్వాత శేష్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు. అందుకే డెకాయిట్ మీద జనాల్లో స్పెషల్ ఇంట్రస్ట్ ఉంది. దర్శకుడు షానియేల్ డియో ఎవరికీ తెలియదు. సో ఆ బ్రాండ్ పనిచేయదు. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన పాటలు కూడా మరీ ఛార్ట్ బస్టర్ కాదు. బాగానే ఉన్నాయి కానీ వైరల్ అయ్యే స్థాయిలో లేకపోవడం కొంత మైనస్ అయ్యింది. విజువల్ గా క్లిక్ అవుతాయేమో చూడాలి.
పోటీపరంగా డెకాయిట్ పెద్ద రిస్క్ లో లేదు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం ప్రదీప్ రంగనాథన్ ఫేస్ వేల్యూ మీద బిజినెస్ చేస్తోంది. అయితే అర్ధమయ్యి కానట్టు ట్రైలర్ లో చూపించింది అంచనాలు పెంచలేకపోయింది. ఇక పల్లి చట్టంబిలో మలయాళ ఫ్లేవర్ మనోళ్ళకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందనేది అనుమానంగానే ఉంది. లక్కీగా అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా ఒక వారం వాయిదా పడటం హిందీ మార్కెట్లలో ఉపయోగపడుతుంది. హిట్ టాక్ వస్తే పండగే.
Gulte Telugu Telugu Political and Movie News Updates