గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. న‌య‌న్ గ‌తంలో ధ‌నుష్ స‌ర‌స‌న యార‌డీ నీ మోహిని చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. త‌ర్వాత ధ‌నుష్ ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాలో ఆమె ఉచితంగా ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక న‌య‌న‌తారతో పెళ్లి కావ‌డానికి ముందు విఘ్నేష్ శివ‌న్‌కు వీఐపీ సినిమాలో అసిస్టెంట్‌గా అవ‌కాశం ఇవ్వ‌డ‌మే కాక‌.. అత‌ణ్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ విజ‌య్ సేతుప‌తి-న‌య‌న‌తార‌ల‌తో నానుమ్ రౌడీదా సినిమాను ప్రొడ్యూస్ చేసింది కూడా ధ‌నుషే. 

అలాంటిది కొన్నేళ్ల ముందు న‌య‌న్, విఘ్నేష్ త‌మ పెళ్లి వీడియోలో నానుమ్ రౌడీదా చిత్రానికి సంబంధించి కొన్ని సెక‌న్ల ఫుటేజీ వాడుకుంటే వాళ్ల‌కు లీగ‌ల్ నోటీసులు ఇచ్చాడు ధ‌నుష్‌. అంత‌గా విఘ్నేష్‌, న‌య‌న్‌ల‌తో ధ‌నుష్‌కు దూరం పెరిగింది. దీని వెనుక కార‌ణాల గురించి ర‌క‌రకాల ప్ర‌చారాలు ఉన్నాయి. ఐతే న‌య‌న్ స‌గ‌తెలా ఉన్న‌ప్ప‌టికీ, త‌న‌కు లైఫ్ ఇచ్చిన ధ‌నుష్ విష‌యంలో విఘ్నేష్ కృత‌జ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ధ‌నుష్ గురించి విఘ్నేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ధ‌నుష్ పెద్ద వ‌య‌స్కుడు కాన‌ప్ప‌టికీ.. తాను అత‌డికి తండ్రి స్థానం ఇస్తాన‌న్నాడు విఘ్నేష్‌. త‌న తండ్రి మ‌ర‌ణించిన రోజే.. ధ‌నుష్ బ‌ర్త్ డే అని.. అత‌ణ్ని త‌న తండ్రిగానే భావిస్తాన‌ని విఘ్నేష్ చెప్పాడు.

ప్ర‌స్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత మంచి జీవితం గ‌డుపుతున్నాను అంటే అందుకు ముఖ్య కార‌ణం ధ‌నుషే అని స్ప‌ష్టం చేశాడు విఘ్నేష్‌. వీఐపీ షూటింగ్ టైంలో రెండేళ్ల పాటు ధ‌నుష్‌తోనే ఉన్నాన‌ని.. ఆ టైంలో ఆయ‌న తిన్నాకే తాను భోంచేసేవాడిన‌ని విఘ్నేష్ గుర్తు చేసుకున్నాడు.

త‌మ మ‌ధ్య ఒక‌ప్పుడు గొప్ప అనుబంధం ఉండేద‌ని.. ఇప్పుడ‌ది లేద‌ని.. అందుకు సిగ్గుప‌డుతున్నాన‌ని విఘ్నేష్ వ్యాఖ్యానించాడు. కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ స‌ర్దుకుంటాయ‌ని.. కానీ త‌మ మ‌ధ్య అలాంటి ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని.. ఇలా ఎందుకు జ‌రిగిందో తెలియ‌డం లేద‌ని విఘ్నేష్ అన్నాడు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడిగా త‌న తొలి చిత్రం పోడాపోడీని విజ‌య్ మూవీ తుపాకికి పోటీగా రిలీజ్ చేయ‌డం పెద్ద మైన‌స్ అని.. ఆ సినిమా ఇంట‌ర్వెల్లో విజ‌య్ 12 మందిని షూట్ చేస్తాడ‌ని.. కానీ సినిమాలో క‌నిపించ‌ని 13వ వ్య‌క్తిని త‌నే అని.. విజ‌య్ దెబ్బ‌కు త‌న ప‌నైపోయింద‌ని అన్నాడు విఘ్నేష్‌.