Movie News

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మరీ భయపెట్టేలా సింగల్ డిజిట్ లో ఉండటం చూసి అభిమానులు కలవరపడుతున్నారు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో ఉదయం షోలు హౌస్ ఫుల్స్ ఎలాగూ అవుతాయి కానీ ఇలా అమెరికాలో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రావేమో అనేలా బుకింగ్స్ జరగడం చూస్తుంటే పెద్ద రిలీజ్ చేసి తొందరపడ్డారేమో అనిపిస్తోంది.

నిజానికి రేసు గుర్రం ఎవరూ కాదనలేని బ్లాక్ బస్టర్. దర్శకుడు సురేందర్ రెడ్డిని మరింత పెద్ద లీగ్ లోకి వెళ్లేలా చేసింది ఈ మూవీనే. బన్నీ మార్కెట్ కూడా పెంచింది. కామెడీ, యాక్షన్, మ్యూజిక్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. హీరోయిజంకు ఢోకా లేకుండా ఫుల్ మాస్ స్టఫ్ ఇచ్చారు సూరి. తమన్ ఇచ్చిన పాటలు ఇప్పటికీ హమ్ చేసుకునేలా ఉంటాయి. కాకపోతే టీవీలో కొన్ని వందలసార్లు ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. యూట్యూబ్ లో ఉచితంగా చాలా ఛానల్స్ లో అందుబాటులో ఉంది.

అంటే ఈ కారణంగా రెస్పాన్స్ తక్కువని చెప్పలేం కానీ రేసు గుర్రంకు ఈ స్పందన ఆశ్చర్యం కలిగించేదే. అందులోనూ పుష్ప 2 తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది. ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉంటారు. సెలబ్రేషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో సంబరాలు గట్టిగా ఉండబోతున్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన అభిమాన సంఘాలు, వాటిలో రకరకాల పదవులు తీసుకున్న ఫ్యాన్స్ రేసు గుర్రంకి భారీ వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.

ఒకటి మాత్రం నిజం. రీ రిలీజ్ ట్రెండ్ ఎవరికీ అంతు చిక్కడం లేదు. కొన్ని డిజాస్టర్లు విరగబడి ఆడతాయి. కొన్ని సూపర్ హిట్లు రెండో రోజే చేతులు ఎత్తేస్తాయి. ఒక క్లాసిక్ ని ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకుంటే మరో క్లాసిక్ ని రెండో రోజే తిరస్కరిస్తారు. అయినా సరే ట్రేడ్ రిస్క్ చేస్తూనే ఉంది. ఇంకో అయిదు రోజుల్లో రేసు గుర్రం వచ్చేస్తోంది. అమెరికా సంగతి పక్కనపెడితే ఏపీ తెలంగాణలో అయినా ఏమైనా రికార్డులు సాధిస్తుందేమో చూడాలి. పోటీ లేని రోజు కాబట్టి లాభపడే ఛాన్స్ ఉంది

This post was last modified on April 3, 2026 9:52 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

3 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

4 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

5 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

6 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

6 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

8 hours ago