Movie News

ధూరందర్, యానిమల్… నీ దారెటు భాయ్?

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, రీసెంట్ గా వచ్చిన ‘ధురంధర్’ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సినిమాలు చూస్తే ఒక విషయం అర్థమవుతోంది.. ఇప్పుడు ఓ వర్గం ఆడియన్స్ కి కావాల్సింది రొటీన్ మాస్ మసాలా కథలు కాదు, కాస్త ‘రా’ గా ఉన్నా, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలు. ఇలాంటి టైంలో మన భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా కోసం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లిని ఎంచుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

వరుస పరాజయాలతో ఉన్న సల్మాన్, ఈసారి ఎలాంటి కథతో వస్తారనేది అందరిలోనూ ఒక క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డ్ చూస్తే, ఆయన సినిమాల్లో ఒక పక్కా కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తుంది. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి చిత్రాల్లో హీరోని ఎలివేట్ చేసే విధానం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న ‘యానిమల్’ లాంటి ట్రెండ్‌లో సల్మాన్ కూడా మళ్ళీ అదే పాత స్టైల్ బిల్డప్ సీన్లకే పరిమితం అవుతారా? లేక వంశీ పైడిపల్లి తన మేకింగ్ స్టైల్ మార్చి సల్మాన్‌ను కొత్తగా చూపిస్తారా? అన్నది ఇప్పుడు అసలు సస్పెన్స్.

నిజానికి సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుకాలేదు కాబట్టి, సల్మాన్ మళ్ళీ పాత రూట్లోనే వెళ్తున్నారని ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ భాయ్‌జాన్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా వంశీ ఏదైనా సరికొత్త కథను సిద్ధం చేసి ఉంటే మాత్రం అది ఫ్యాన్స్‌కు పెద్ద సర్ ప్రైజ్ అవుతుంది. కానీ గతంలో మురుగదాస్ లాంటి కమర్షియల్ దర్శకుడితో చేసిన ‘సికందర్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో వంశీ పైడిపల్లిపై ఇప్పుడు భారీ బాధ్యత ఉంది. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సల్మాన్ ఖాన్‌ను ప్రజెంట్ చేయగలిగితేనే ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది.

దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తుండటం సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. వంశీ పైడిపల్లి తనకున్న ‘క్లాస్’ ఇమేజ్‌ను పక్కన పెట్టి, సల్మాన్ కోసం పక్కా ‘మాస్’ అండ్ రా కంటెంట్‌తో వస్తారా? లేక తనదైన రెగ్యులర్ డ్రామానే నమ్ముకుంటారా? అనేది చూడాలి. ‘ధురందర్’ లాంటి సినిమాలు రేంజ్ పెంచుతున్న తరుణంలో, భాయ్‌జాన్ ఈసారి ఏ దారిలో వెళ్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

This post was last modified on March 31, 2026 3:00 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago