ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదనే వార్త సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఖచ్చితంగా రిలీజ్ ఉంటుందని, మొన్న వదిలిన పెహల్వాన్ టీజర్ లో కూడా నొక్కి చెప్పిన టీమ్ ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం ఎందుకు మార్చుకుందని అభిమానులకు సందేహం కలుగుతోంది. ఆల్రెడీ మార్చి 26 వదలుకున్న పెద్ది బృందం ఇప్పుడు ఇంకో డేట్ త్యాగం చేయడంతో ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్న వైనం ఆన్ లైన్ లో గమనించవచ్చు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పెద్ది ఇంత ఒత్తిడిని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉన్నప్పుడు, ఫలానా టైం లోపు టార్గెట్ రీచ్ కాలేమని అర్థమవుతున్నప్పుడు అనౌన్స్ మెంట్స్ ఇవ్వకుండా ఉండాల్సింది. దాని వల్ల ఫ్యాన్స్ సమయం ఆదా కావడంతో పాటు లేనిపోని ఆశలు పెట్టుకోకుండా ఎదురు చూస్తారు. అలా కాకుండా పదే పదే తేదీలు మారుస్తూ పోతే ఉన్న హైప్ మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి. ఇది సహజం. రాజమౌళికి కూడా తప్పలేదు. కానీ పెద్ది మేకర్స్ ఒక వాస్తవాన్ని గుర్తించాలి. రామ్ చరణ్ ఇంత కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి బెస్ట్ డేట్ ఇవ్వాలనే సంకల్పం మంచిదే. అలాని తొందరపడి మంచి డేట్ల మీద కర్చీఫ్ వేసేసి తర్వాత వద్దనుకోవడం ఇతర నిర్మాతలకు సమస్యగా మారింది. అందుకే గాయపడ్డ సింహం చాలా తెలివిగా మే 1 అనౌన్స్ చేసుకుని తెలివైన పని చేసింది. స్వయంభు కూడా ఏప్రిల్ 30 వచ్చే ప్లాన్ లో ఉంది.
పెద్ది గురించి కొత్త డేట్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చేసింది. మే 21 ఆప్షన్ ని నిర్మాతలు పరిశీలిస్తున్నారట. ఎక్స్ ట్రా ఇరవై రోజులు టైం దొరుకుతుంది కాబట్టి ఆలోగా బుచ్చిబాబు అన్ని పనులు చక్కబెడతాడా అనేది వేచి చూడాలి. లేదూ అనుకుంటే జూన్ కు వెళ్లిపోవడం ఉత్తమమైన పని. ప్రెజర్ తగ్గిపోయి ప్రశాంతంగా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి అన్నీ ఓకే అనుకున్న తర్వాతే బయట ప్రపంచానికి చెబితే బెటర్. లేదంటే ఇంకో తలనొప్పి ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates