బాలీవుడ్ మీడియాతో సమంత నవ్వులాట

​సమంత ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. రీసెంట్ గా ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, తన గ్లామరస్ లుక్‌తోనే కాకుండా, బాలీవుడ్ మీడియాతో ప్రవర్తించిన తీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా జిమ్ బయట లేదా ప్రైవేట్ ప్లేస్‌లలో కెమెరాలు కనిపిస్తే కొంత అసహనం వ్యక్తం చేసే సమంత, ఇలాంటి భారీ ఈవెంట్లలో మాత్రం ఎంతో జోవియల్ గా, సరదాగా ఉంటారని మరోసారి రుజువైంది. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ​ఈవెంట్ రెడ్ కార్పెట్ పై సమంత ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న టైగర్ ప్రింట్ డ్రెస్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఆమె ఫోటోలు తీసుకుంటున్న సమయంలో అక్కడి పాపరాజ్జీలు సమంత బ్యాక్ లుక్ ను చూసి “వావ్” అని కామెంట్ చేశారు. దీనికి సమంత స్పందిస్తూ, ఎంతో స్పోర్టివ్ గా నవ్వుతూ, మళ్ళీ అదే పోజ్ ను రిపీట్ చేయమంటారా? అన్నట్లుగా సరదాగా సైగలు చేశారు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు సమంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను మెచ్చుకుంటున్నారు. మీడియా వాళ్ళతో ఆమె పంచుకున్న ఈ నవ్వులాట ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది. ​కెరీర్ పరంగా చూస్తే, సమంత ప్రస్తుతం తన హెల్త్ పై ఫోకస్ చేస్తూనే, వైవిధ్యమైన ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది కాకుండా, ‘రక్త బ్రహ్మాండ్’ కూడా రెడి అవుతోంది.

పెళ్లి, ఆ తర్వాత ఎదురైన ఆరోగ్య సమస్యల నుండి కోలుకున్న తర్వాత, సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఉన్న క్రేజ్ ఈ ఈవెంట్ లో స్పష్టంగా కనిపించింది.

ముంబై ఈవెంట్ లో సమంత ప్రెజెన్స్ అటు గ్లామర్ పరంగా, ఇటు సోషల్ రేపో పరంగా పర్ఫెక్ట్ గా కుదిరింది. మీడియా వాళ్ళతో సరదాగా ఉంటూనే, తన సినిమాలకు సంబంధించిన బజ్ ను క్రియేట్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఇక రానున్న సినిమాలతో ఆమె ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.