ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది. ఏప్రిల్ 30 సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని టీమ్ సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఇటీవలే రామ్ చరణ్ కంటి మీద చిన్న గాయం కావడం, రెండు రోజులు రెస్ట్ తీసుకుని వెంటనే కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇంకా కీలకమైన ఐటెం సాంగ్ బ్యాలన్స్ ఉంది. దీన్ని దర్శకుడు బుచ్చిబాబు చాలా స్పెషల్ గా ప్లాన్ చేశాడు.

ఆ పాటలో మృణాల్ ఠాకూర్ ఆడిపాడొచ్చనే టాక్ ఉంది కానీ ఎంతమేరకు నిజమో యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం. సరే దీని సంగతి కాసేపు పక్కనపెడితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నార్త్ అమెరికా బుకింగ్స్ పోస్ట్ పోన్ చేశారేమోననే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. పెద్ది బృందం మాత్రం అన్నింటికి సిద్ధంగా ఉంది. చరణ్ వైపు నుంచి పూర్తి సహకారం ఉన్నప్పటికీ డెడ్ లైన్ మీట్ కావడం పట్ల నెలకొన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇదేదో తమకు అవకాశం ఇచ్చేలా ఉందని ముందే పసిగట్టిన గాయపడ్డ సింహం నిర్మాతలు మే 1 విడుదల తేదిని ప్రకటించేసుకున్నారు. పెద్ది వచ్చే పక్షంలో తప్పుకుంటారు. అఖిల్ లెనిన్ ని అదే డేట్ కి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాల గురించి నిర్మాత నాగవంశీ ఆల్రెడీ చర్చలు మొదలుపెట్టారట. ఈ వారంలోనే నిర్ణయం తీసుకోవాలి. ఇంకా బాలన్స్ షూటింగ్ ఉన్న నేపథ్యంలో ఇది హఠాత్తుగా తీసుకునే డెసిషన్ కాదు.

మొత్తానికి పెద్ది విషయంలో దేనికైనా ప్రిపేర్ అవ్వడం అవసరం. బిజినెస్ పరంగా ఏప్రిల్ 30 చాలా మంచి డేట్ కావడంతో దాన్ని వదులుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కు సంబంధించి ఫైనల్ అవుట్ ఫుట్ అనుకున్న టైంకంతా వస్తుందా లేదానే దాన్ని బట్టి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడిలో అసలు ప్రమోషన్లకు టైం ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్. సమాధానం దొరకాలంటే ఇంకో వారం రోజులు వెయిట్ చేయడం తప్ప ఆప్షన్ లేదు.