అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. ఇంత వేగంగా ఈ ఫీట్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేసినప్పటికీ వాళ్ళ లెక్కలను మించిన నెంబర్లు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చేయడం వల్ల ఎంత మేలు కలుగుతోందో ఏపీ తెలంగాణ థియేటర్లలో నమోదవుతున్న కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది. ఆ స్థాయి ర్యాంపేజ్ ఉంది.
సెకండ్ వీక్ ఇప్పుడు మొదలయ్యింది కాబట్టి ఆల్ టైం నెంబర్ వన్ గ్రాసర్ గా పుష్ప 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్లను దాటేయడం దురంధర్ 2కి సులభమయ్యేలా ఉంది. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ లోనూ తనకు కాంపిటేషన్ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ముందే తేలిపోగా తాజాగా వచ్చిన కొత్త రిలీజులు ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదని టాక్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక హిందీలో సరేసరి. ఏప్రిల్ 10 అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా వచ్చే దాకా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది.
ఒకరకంగా చూస్తే రెండు వేల కోట్ల గ్రాస్ సాధించడం దురంధర్ ది రివెంజ్ వల్ల సాధ్యమయ్యేలా ఉంది. ముంబై లాంటి నగరాల్లో ఇప్పటికీ ఉదయం ఆరేడు గంటలకు షోలు వేస్తున్నా డెబ్భై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈవెనింగ్, సెకండ్ షోలకు టికెట్లు దొరికితే ఒట్టనేలా ఇప్పటికీ టఫ్ సిచువేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ ప్రీమియమ్ స్క్రీన్లలో పలుకుబడి ఉంటే తప్ప చూడలేని పరిస్థితి నెలకొంది. సో ఇంకో పదిహేను రోజులకి మించి ఈ దూకుడు ఇలాగే ఉండనుంది.
ప్రత్యేకంగా ప్రమోషన్లు ఈవెంట్లు చేయకపోయినా దురంధర్ 2 ఈ స్థాయిలో విధ్వంసం చేయడం మాటలకూ అందనిది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ముప్పై నుంచి నలభై మిలియన్లకు పైగా వసూలవుతుందని అక్కడి ట్రేడ్ బలంగా చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లేని ఒక రియలిస్టిక్ డ్రామాకు ఇంత రెస్పాన్స్ రావడం చూస్తే ప్రేక్షకులు ఏ స్థాయిలో మంచి కంటెంట్ కోసం తహతహలాడుతున్నారో అర్థమవుతుంది. అందుకే ఈ మూవీకి అంత బ్రహ్మరథం పట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates