టాలీవుడ్‌లో రియల్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రీహరి. నటన ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పగా ఉండేది. శ్రీహరి ఇంటికి వెళ్లిన ఏ అభిమాని కూడా ఖాళీ కడుపుతో తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అంతటి గొప్ప లెగసీని మోస్తూ పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి ప్రయత్నంలో వయసు రీత్యా చిన్నవాడు కావడం, సరైన అనుభవం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ ఇప్పుడు మేఘాంశ్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం పక్కా ప్లాన్‌తో సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
చాలా కాలం గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, ఈ మధ్య కాలంలో తనను తాను పూర్తిగా తీర్చిదిద్దుకున్నారు. గతంలో ఉన్న లుక్ కంటే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపిస్తున్నారు. కేవలం ఫిజిక్ మాత్రమే కాదు, నటనలో కూడా శిక్షణ తీసుకుని తన తండ్రి పేరును నిలబెట్టాలనే కసితో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే, శ్రీహరి కొడుకా అన్నట్లుగా ఆరడుగుల కటౌట్‌తో మాస్ అప్పీల్‌ను చూపిస్తున్నారు.
ప్రస్తుతం మేఘాంశ్ ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను ఓకే చేసినట్లు సమాచారం. రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా, తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించే కథను ఆయన ఎంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సైలెంట్‌గా మొదలైనట్లు ఫిలిం నగర్ టాక్. తన తండ్రికి ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటూనే, నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా రాబోతోందట. ఈసారి ఎక్కడా తప్పు జరగకుండా ప్రతి విషయంలోనూ మేఘాంశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శ్రీహరి గారు ఉన్నప్పుడు ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయన మరణం తర్వాత ఆ లోటును భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి సపోర్టింగ్ రోల్స్ చేసే నటుడే కనిపించడం లేదు. కానీ ఆయన వారసుడిగా మేఘాంశ్ నిలదొక్కుకుంటే చూడాలని మెగాస్టార్ చిరంజీవి నుంచి సామాన్య అభిమానుల వరకు అందరూ కోరుకుంటున్నారు.
అందుకే ఈ కొత్త ప్రాజెక్టు విషయంలో ఇండస్ట్రీలోని పెద్దల సలహాలు కూడా తీసుకుంటున్నారట. ముఖ్యంగా మేఘాంశ్ మేకోవర్ చూసిన వారు, పక్కాగా సెట్ అయితే తన తండ్రిలాగే పవర్‌ఫుల్ రోల్స్ చేయగలరని అభిప్రాయపడుతున్నారు.
కేవలం హీరోగా మాత్రమే కాకుండా, కథలో బలం ఉంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా మేఘాంశ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీహరి గారు కూడా విలన్‌గా మొదలై హీరోగా ఎదిగారు కాబట్టి, ఆ రూట్లోనే వెళ్లడం మేఘాంశ్ కు ప్లస్ అవుతుంది. త్వరలోనే ఈ కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
