Movie News

యువ నటికి పుష్ప చేసిన గాయం

ఒక సినిమా కోసం ఆర్టిస్టులను సంప్రదించినప్పుడు పాత్ర చాలా బాగుంటుందని, దాని నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. షూటింగ్‌లో కూడా ప్రాధాన్యం ఇస్తారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక ఎడిటింగ్‌లో సన్నివేశాలు తీసేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొందరు ఆర్టిస్టులు దీనిపై బాధపడుతుంటారు, మరికొందరు అలవాటు చేసుకుంటారు.

ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని యువ నటి దివి వడిత్య చెబుతోంది. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్లో కూడా మంచి పాత్ర చేసింది. అయితే పాన్ ఇండియా చిత్రం పుష్ప 2లో అవకాశం రావడంతో చాలా ఆశలు పెట్టుకుంది.

ఫస్ట్ గ్లింప్స్‌లో జర్నలిస్ట్ పాత్రలో దివి కనిపించడంతో తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. ఈ సినిమా కోసం దాదాపు 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నానని, 10 రోజులు డబ్బింగ్ కూడా చెప్పానని తెలిపింది. ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని భావించింది.

కానీ సినిమా విడుదలయ్యాక తన సీన్లు ఎక్కువగా కట్ అయ్యాయని చూసి నిరాశ చెందిందని చెప్పింది. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అసౌకర్యంగా అనిపించిందని కూడా వెల్లడించింది.

అయితే ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో సాధారణమేనని, దాన్ని త్వరగా మర్చిపోయి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

ఇక తాజాగా చేసిన బికినీ ఫోటోషూట్ గురించి మాట్లాడుతూ, తాను గ్లామర్ రోల్స్ చేయగలనని దర్శకులకు చూపించడానికి అలా చేశానని చెప్పింది.

This post was last modified on March 21, 2026 11:00 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago