ఒక సినిమా కోసం ఆర్టిస్టులను సంప్రదించినప్పుడు పాత్ర చాలా బాగుంటుందని, దాని నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. షూటింగ్‌లో కూడా ప్రాధాన్యం ఇస్తారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక ఎడిటింగ్‌లో సన్నివేశాలు తీసేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొందరు ఆర్టిస్టులు దీనిపై బాధపడుతుంటారు, మరికొందరు అలవాటు చేసుకుంటారు.
ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని యువ నటి దివి వడిత్య చెబుతోంది. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్లో కూడా మంచి పాత్ర చేసింది. అయితే పాన్ ఇండియా చిత్రం పుష్ప 2లో అవకాశం రావడంతో చాలా ఆశలు పెట్టుకుంది.
ఫస్ట్ గ్లింప్స్‌లో జర్నలిస్ట్ పాత్రలో దివి కనిపించడంతో తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. ఈ సినిమా కోసం దాదాపు 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నానని, 10 రోజులు డబ్బింగ్ కూడా చెప్పానని తెలిపింది. ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని భావించింది.
కానీ సినిమా విడుదలయ్యాక తన సీన్లు ఎక్కువగా కట్ అయ్యాయని చూసి నిరాశ చెందిందని చెప్పింది. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అసౌకర్యంగా అనిపించిందని కూడా వెల్లడించింది.
అయితే ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో సాధారణమేనని, దాన్ని త్వరగా మర్చిపోయి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.
ఇక తాజాగా చేసిన బికినీ ఫోటోషూట్ గురించి మాట్లాడుతూ, తాను గ్లామర్ రోల్స్ చేయగలనని దర్శకులకు చూపించడానికి అలా చేశానని చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
