ఒకప్పటి హీరోయిన్, ఆ తర్వాత ఐటెం భామగా మారిన మలైకా అరోరా.. ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్‌ఖాన్‌ను పెళ్లాడి.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన మలైకా.. కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె వయసులో తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం నడపడం చర్చనీయాంశంగా మారింది.
అర్జున్‌తో ప్రేమలో పడడం వల్లే మలైకా.. అర్బాజ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఎవరేమనుకున్నా సరే.. ఈ జంట ఏమీ పట్టించుకోకుండా కొన్నేళ్ల పాటు సహజీవనం చేసింది. కానీ తర్వాత ఇద్దరి మధ్య ఏమైందో ఏమో.. విడిపోయారు. కొన్నేళ్లుగా మలైకా ఒంటరిగానే ఉంటోంది. కానీ ఇప్పుడు ఆమె కొత్త తోడును వెతుక్కున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
మలైకాకు, అర్జున్‌కు వయసు అంతరం అంత ఎక్కువ ఉండడం గురించే అప్పట్లో అంతగా మాట్లాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంకా చిన్నవాడితో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందంటున్నారు. ఆ కుర్రాడి పేరు.. సోరబ్ బేడి. అతను ఒక మోడల్, టీవీ నటుడు. తన వయసు 32ఏళ్లు మాత్రమే. అంటే మలైకా కంటే 20 ఏళ్లు చిన్నవాడు.
ఇటీవల ఇద్దరూ కలిసి ఒక పార్టీలో పాల్గొన్న సందర్భంగా చాలా సన్నిహితంగా కనిపించారు. ఒకరినొకరు హగ్ చేసుకుని సెల్ఫీలు తీసుకున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ చూస్తే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ద వయస్కులైన మేల్ సెలబ్రెటీలు.. చిన్న వయసు అమ్మాయిలతో ఎఫైర్లు నడపడం చూశాం కానీ.. మలైకా మాత్రమే తన స్పెషాలిటీని చాటుకుంటోందంటూ ఆమె మీద కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తెలుగులో ఆమె గబ్బర్ సింగ్ సినిమాలో చేసిన కెవ్వు కేక పాట ఎంత పాపులరో తెలిసిందే.
This post was last modified on March 11, 2026 7:55 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…