Movie News

నిద్రపోతున్నావా… నటిస్తున్నావా దురంధరా

కేవలం పదమూడు రోజులే ఉన్నా దురంధర్ 2 రివెంజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం వాయిదా పుకార్లకు బలం చేకూరుస్తోంది. ఒకవేళ చెప్పిన డేట్ కే రిలీజ్ అనుకుంటే ఈపాటికి ట్రైలర్ వచ్చి ఉండాలి. కనీసం ఆ సూచనలు లేవు. పాటలు రిలీజ్ కాలేదు. కనీసం కొత్త పోస్టర్లు వదలడం ఆపేశారు. దర్శకుడు ఆదిత్య ధార్ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడని అనుకున్నా మిగిలిన ప్రమోషన్ టీమ్ ఏం చేస్తోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒకవైపు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. ఇప్పుడు కనక డ్రాప్ అయితే ఆల్రెడీ ఉన్న బజ్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. టాక్సిక్ ఎలాగూ తప్పుకుంది కాబట్టి దురంధర్ 2 తనకు దొరికిన సోలో రిలీజ్ తో రికార్డుల సునామి సృష్టించవచ్చు. ఒకవేళ తప్పుకుంటే యుఎస్, యుకె తదితర దేశాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కు పెద్ద అడ్వాంటేజ్ దొరుకుతుంది.

ఈసారి దురంధర్ 2 హిందీ కాకుండా తెలుగు ఇతరత్రా భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. ఇప్పుడు హిందీ వెర్షన్ మీదే అనుమానాలు వస్తున్నాయి. పబ్లిసిటీ మీద అస్సలు ఫోకస్ పెట్టకపోవడం ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తోంది. ఇంతకీ ఉంటుందా లేదా అనేది తేల్చి చెప్పమంటున్నారు. ఇవాళ కనక ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోతే దురంధర్ 2 మీద ఆశలు వదిలేసుకోవచ్చని బాలీవుడ్ విశ్లేషకుల మాట. అదే జరిగితే బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టు అవుతుంది.

ఎందుకంటే ఇంత క్రేజ్ ఉన్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు సోలో రిలీజ్ దక్కితే వసూళ్ల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండవు. కానీ చేతికొచ్చిన బంగారు బాతుని చేతులారా చంపేసుకున్నట్టు కాకుండా మార్చ్ 19 దురంధర్ 2 విడుదల కావాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. మిస్ అయితే మాత్రం ఆగస్ట్ కు వెళ్లే సూచనలు ఉన్నాయి. కానీ ఆ నెలలో జైలర్ 2, ది ప్యారడైజ్ లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. దురంధర్ 2 వస్తుందని అవేవీ తప్పుకోకపోవచ్చు. ఏదో ఒకటి వీలైనంత త్వరగా ఇంకా చెప్పాలంటే అత్యవసరంగా అప్డేట్ ఇవ్వడం దురంధర్ 2 పాటించాల్సిన తక్షణ కర్తవ్యం.

This post was last modified on March 6, 2026 10:42 am

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

3 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

4 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

5 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

5 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

6 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

7 hours ago