టాక్సిక్ తప్పుకుని మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ రావడం కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు డెకాయిట్ గురించిన చర్చ మూవీ లవర్స్ మధ్య జరుగుతోంది. అసలు అందరికంటే ముందుగా ఈ డేట్ మీద కన్నేసింది అడివి శేష్. అధికారికంగా ప్రకటన ఇచ్చి టీజర్ కూడా వదిలారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం కావడంతో పెద్ద ఎత్తున రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ మధ్య ఇబ్బంది పడటం మంచి స్ట్రాటజీ కాదని గుర్తించి తప్పుకుని ఏప్రిల్ 10కి వెళ్లిపోయారు.
అయితే ఒకవేళ ముందు అనుకున్న తేదీకే కట్టుబడి ఉంటే మంచి అడ్వాంటేజ్ దక్కి ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రాక్టికల్ గా ఎలా చూసుకున్నా డెకాయిట్ చేసింది తెలివైన పనే. ఎందుకంటే ఒకవేళ మార్చి 19కి రావాలని డిసైడ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో క్లాష్ వచ్చేది. ఇది శేష్ కు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, అకీరానందన్ కు తను ఎంత దగ్గరివాడో చెప్పనక్కర్లేదు.
పైగా థియేటర్ కౌంట్ పరంగా ఇబ్బంది వచ్చి డెకాయిట్ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. పైగా దురంధర్ 2 వాయిదా అనౌన్స్ మెంట్ ఇంకా రానే లేదు. ఒకవేళ హఠాత్తుగా మేం తప్పుకోవడం లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ కు వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ నార్త్ మార్కెట్ లో డెకాయిట్ కు ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేది. సో జరిగేదంతా మంచికే అన్నట్టు డెకాయిట్ విషయంలో జరిగినవి సానుకూలంగానే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం చివరి దశ పనుల్లో శేష్ టీమ్ బిజీగా ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామా అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించాడు. హిందీ మార్కెట్ మీద పెద్ద కన్ను వేశారు. మేజర్ ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ఆడటంతో శేష్ కు అక్కడ గుర్తింపు వచ్చింది. దాన్ని విస్తరించుకునే పనిలో భాగంగానే డెకాయిట్ ని ఇంత పెద్ద స్కేల్ తో నిర్మిస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే ఇదే సంవత్సరం రిలీజయ్యే గూఢచారి 2కి బిజినెస్ పరంగా పెద్ద ప్లస్ అవుతుంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెకాయిట్ క్యాలికులేషన్లు ప్రాపర్ గానే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates