హే భగవాన్ కంటెంట్ చూసి హే బలవంత్ గా మార్చమన్నారు. కపుల్ ఫ్రెండ్లి టైటిల్ లో వేరే అర్థం ఉందని ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఛాయ్ వాలా అంటే ఏదో సమస్యని నవాబ్ కేఫ్ గా మార్పించారు. శ్రీ చిదంబరంకి గారు జోడిస్తేనే సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా సరస్వతి దేవత పేరు కాబట్టి దానికి ముందు ఎస్ అని ఇనీషియల్ పెడితే కియరెన్స్ దొరికింది. ఇక్కడ చెప్పింది కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇటీవలే సెన్సార్ అధికారుల తీరు గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. నిర్మాణంలో ఉన్నప్పుడు, ప్రమోషన్లు చేస్తున్నప్పుడు ఒక పేరు అలవాటు అయ్యాక హఠాత్తుగా దాన్ని మార్చాల్సి రావడం వల్ల దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇదో పెద్ద ఇబ్బందిగా మారింది. గతంలో లక్ష్మి అని వెంకటేష్ ఒక మూవీ చేశారు. సెంటిమెంట్ ఉన్నప్పటికీ అది ఫక్తు కమర్షియల్ బొమ్మ.
విజయదశమి అనే కళ్యాణ్ రామ్ మూవీలో ఫుల్ వయొలెన్స్ ఉంటుంది. వేణు నటించిన దీపావళిలో ఆ పండగ ప్రస్తావన తప్ప అన్నీ ఉంటాయి. శ్రీహరి భద్రాద్రి, సింహాచలం, భద్రాచలంలో ఆ పుణ్యక్షేత్రాల విశేషాలు ఉండవు. సమరసింహారెడ్డి అంటే ఆ పేరుతో ఉన్న రాజకీయ నాయకుడి బయోపిక్ కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతు పొంతు ఉండదు కానీ ఎన్నడూ లేనిది ఇప్పుడు టైటిల్స్ గురించి ఇన్ని ఆంక్షలు ఎందుకు వస్తున్నాయన్నది పరిశ్రమలో రేగుతున్న ప్రశ్న.
కేరళతో సంబంధమే లేని కథకు ది కేరళ స్టోరీ 2 అని పెట్టినప్పుడు అభ్యంతరం రాలేదు. ఇందూ సర్కార్ అని నేరుగా ఇందిరాగాంధీ పాలనను విమర్శించే సినిమా తీసినప్పుడు అడ్డంకులు రాలేదు. మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ ని టార్గెట్ చేసుకుని సినిమా తీసినా రిలీజ్ కాకుండా ఆగలేదు. అలాంటప్పుడు టాలీవుడ్ పేర్ల దగ్గరే ఎందుకు ఇలా చేస్తున్నారనేది అంతు చిక్కని క్వశ్చన్.
సెన్సార్ వాళ్ళు చేసింది తప్పని ఎవరూ అనరు. కానీ విధివిధానాలు లేదా గైడ్ లైన్స్ లాంటివి మరింత స్పష్టంగా ఉంటే మేకర్స్ ఇకపై పేర్ల విషయంలో జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ కథ రిపీటవుతూనే ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates