బాక్సాఫీస్ వద్ద థ్రిల్లర్ సినిమాలను మించిన ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఉదయాన్నే టాక్సిక్ ఇచ్చిన షాక్ నుంచి మూవీ లవర్స్ ఇంకా పూర్తిగా బయట పడలేదు. దురంధర్ 2 రివెంజ్ కూడా ఇదే దారిలో ఉందనే పుకార్లు గట్టిగ షికారు చేస్తున్నాయి. కానీ జియో స్టూడియోస్ అంత సులభంగా వెనక్కు తగ్గేలా లేదు. ఓవర్సీస్ బుకింగ్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. సో పోస్ట్ పోన్ లేనట్టే.
ఇక అసలు ట్విస్టు ఏంటంటే మార్చి 26 విడుదల ప్లాన్ చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వారం ముందు అంటే మార్చి 19 వచ్చేందుకు సన్నాహాల్లో ఉన్నట్టు ఫ్రెష్ అప్డేట్. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రాధమిక సమాచారం వెళ్లిపోయిందని విశ్వసనీయ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకనే కోణంలో విశ్లేషించుకుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడతాయి. మార్చి మూడో వారం లాంగ్ వీకెండ్. ఉగాది, రంజాన్ పండగతో కోలాహలంగా ఉంటుంది. సినీ ప్రియులు సరైన ఆప్షన్ కోసం వారాల తరబడి ఎదురు చూస్తున్నారు.
ఎలాగూ టాక్సిక్ కోసం అట్టిపెట్టిన థియేటర్లు ఖాళీగా ఉంటాయి. వాటిని గంపగుత్తగా దురంధర్ 2కి ఇవ్వలేరు. సో ఉస్తాద్ భగత్ సింగ్ కనక రంగంలోకి దిగితే భారీ ఓపెనింగ్స్ ఖాయం. పాజిటివ్ టాక్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఊచకోత మాములుగా ఉండదు. దురంధర్ 2 వచ్చినా కూడా మన ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు దానికి దూరంగా ఉంటారు. సో అప్పుడు మిగిలే ఏకైక ఆప్షన్ భగత్ సింగే. సో ఈ అవకాశాన్ని వదులుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని సమాచారం.
ఇంకో ట్విస్టు కూడా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ బదులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు తమన్ కి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. గతంలో పుష్ప 2 టైంలోనూ ఇలాగే మార్పు జరిగి సామ్ సిఎస్ కి కొంత వర్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ అదే రిపీట్ అయ్యేలా ఉంది.
ఈ రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ వి కావడం గమనార్హం. మొత్తానికి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి క్లారిటీ ఇవాళో రేపో వచ్చే అవకాశముంది. ఒకవేళ దురంధర్ 2 తప్పుకుంటే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కి ఓపెన్ గ్రౌండ్ లో సిక్సర్ల మోతే.
Gulte Telugu Telugu Political and Movie News Updates