మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ చేశాయి కానీ దీని మీద వచ్చిన అటెన్షన్ వేరేవాటికి రాలేదన్నది వాస్తవం. అయితే ఫోకస్ బాగానే పడింది కానీ బాక్సాఫీస్ దగ్గర బలవంత్ సౌండ్ ఏమంత బిగ్గరగా లేదు.
నిన్న ఆదివారం అయినప్పటికీ చాలా చోట్ల ఆక్యుపెన్సీలు సగం కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. సాయంత్రం క్రికెట్ మ్యాచ్ ప్రభావం కొంత ఉందనుకున్నా.. ఉదయం, మధ్యాన్నం షోలలో కూడా మేజిక్ జరగలేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో జనాలు కనిపించగా బిసి సెంటర్స్ లో మాత్రం బలవంత్ ఎదురీదుతున్న వైనం స్పష్టం.
ముఖ్యంగా బిజినెస్ బిజినెస్ అంటూ టీమ్ తెగ ఊదరగొట్టిన పాయింటే ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసినట్టుగా కనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు అది క్రియేటివ్ గా అనిపించి ఉండొచ్చు కానీ నరేష్ తో చేయించిన వ్యాపారం ఏదైతే ఉందో అది కుటుంబాలు అంగీకరించేది కాదు.
దానికి జస్టిఫికేషన్, ఎమోషన్స్ తగినంత జోడించినా అవి పూర్తి కన్విన్సింగ్ గా లేకపోగా సదరు బిజినెస్ ని సమర్ధించుకునేందుకు పడిన ప్రయాస ప్రభావం చూపించింది. ట్రేడ్ టాక్ ప్రకారం వీకెండ్ వరకు హే బలవంత్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయిదు కోట్లు దాటిందట. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ ఇంకా దూరంలో ఉన్నట్టే
ఈ శుక్రవారం విష్ణు విన్యాసం రిలీజవుతున్న నేపథ్యంలో హే బలవంత్ వీక్ డేస్ లో ఏం చేస్తుందనేది చూడాలి. బాక్సాఫీస్ తత్వం బోధ పడిందో ఏమో ప్రస్తుతానికి టీమ్ అయితే ప్రచారాన్ని ఆపేసింది. నిర్మాత చెప్పిన ప్రకారం ఓవర్సీస్ లో వన్ మిలియన్ దాటాలి కానీ ప్రస్తుతం సగానికే పోరాడుతున్న వైనం స్పష్టం.
అన్ని వర్గాలను మెప్పించే యునానిమాస్ టాక్ వస్తే వేరుగా ఉండేది కానీ ఇలాంటి రెస్పాన్స్ తోనే కొంచెం సమస్య ఉంటుంది. సుహాస్ కోణంలో చూస్తే గ్రాస్ పరంగా తనకిది పెద్ద నెంబర్ అవుతుందా లేదా అనేది వచ్చే వీకెండ్ తో తేలిపోతుంది. రాబోయే రెండు వారాలు శ్రీవిష్ణు డామినేషన్ ఉండటం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates