Movie News

ప్రకాష్ రాజ్ బీఫ్ కామెంట్లపై దుమారం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి తరచుగా మోడీ సర్కారు మీద విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాడు ప్రకాష్ రాజ్. ఐతే పాలన, విధానాల విషయంలో ఎన్ని విమర్శలు చేసినా ఓకే కానీ.. కొన్నిసార్లు వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లిపోతుంటాయి.

అంతే కాక ముస్లింల మనోభావాలు, వారి భద్రత గురించి మాట్లాడే ప్రకాష్ రాజ్.. బీజేపీ హిందుత్వ విధానాన్ని తప్పుబట్టే క్రమంలో హిందువుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేస్తుంటారు. పోస్టులు పెడుతుంటారు. ప్రకాష్ రాజ్ విమర్శలు, ఆరోపణలు, కామెంట్లు అన్నీ కూడా సెలెక్టివ్‌గా ఉంటాయన్నది ఎక్కువమంది చేసే విమర్శ.

ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘కేరళ స్టోరీ-2’ ట్రైలర్ మీద సెటైర్ వేస్తూ ఆయన తాజాగా పెట్టిన పోస్టు దుమారం రేపుతోంది. ఈ ట్రైలర్లో ఒక హిందూ మహిళతో ముస్లింలు అత్యాచారం జరిపి, బలవంతంగా బీఫ్ తినిపించినట్లు చూపించారు. దీనికి కౌంటర్‌గా ప్రకాష్ రాజ్.. రియల్ కేరళ స్టోరీ ఇది అంటూ ఆ రాష్ట్రంలో బీఫ్ ఎంత బాగా వండుతారో, ఆ వంటకాలు ఎంత రుచికరంగా ఉంటాయో చెబుతూ ఒక పోస్టు పెట్టాడు.

ఐతే ‘కేరళ స్టోరీ-2’లో అభ్యంతరకర అంశాలు ఉంటే.. వాటిని తప్పుబట్టాలి, అవి నిజం కాదని వాదించాలి కానీ.. హిందువులు గోవును పవిత్రంగా చూస్తారనే విషయం తెలిసి కూడా గోమాంసం మీద ఇలా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ కామెంట్లు, పోస్టులు ఏంటి అని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ హిందూ మతంలో తప్పులను ఎత్తి చూపడమే కాక హిందువుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టే ప్రకాష్ రాజ్.. ఎప్పుడైనా ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో తప్పులను ఎత్తి చూపారా అని నెటిజన్లు ఆయన తీరును దుయ్యబడుతున్నారు.

This post was last modified on February 22, 2026 12:33 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

1 hour ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago