కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇప్పటికే మూవీ లవర్స్ మధ్య హాట్ టాపిక్ గా ఉంది.
గతంలో విడుదల చేసిన గ్లిమ్ప్స్ మీద వివాదం చెలరేగడంతో ఈసారి టీజర్ లో ఇంకేం చూపిస్తారోననే టెన్షన్ అభిమానుల్లో లేకపోలేదు. అందులోనూ దురంధర్ 2 రివెంజ్ తో పోటీ పడుతున్న నేపథ్యంలో టాక్సిక్ కంటెంట్ మీద లుక్ వేయాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ టైం వచ్చేసింది. రెండు నిమిషాల టీజర్ ని వివిధ భాషల్లో ఒకేసారి తీసుకొచ్చారు.
ఇది దశాబ్దాల నాటి వెనుకటి కథ. సెల్ ఫోన్లు, ఇంటర్ నెట్ లేని రోజుల్లో మాఫియా సామ్రాజ్యపు నీలి నీడల గాథ. జాలి దయ అనేవి మచ్చుకైనా లేని ఒక డాన్ (యష్) తనకు అడ్డు వచ్చిన వాళ్ళను ఎంత కిరాతకంగా చంపేందుకైనా వెనుకడడు. క్యాసినో, సర్కస్, క్లబ్బులనే తన అడ్డాలుగా మార్చుకుని వందల కోట్ల వ్యాపారాన్ని చేస్తుంటాడు.
ఇంకోవైపు ఇతని పోలికల్లోనే ఉన్న ఒక యువకుడు (యష్) మారణహోమం సృష్టిస్తూ నేర ప్రపంచానికి కొత్త సవాల్ విసురుతాడు. ఈ ఇద్దరూ ఒకటేనా లేక డబుల్ ఫోటోనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. యష్ రెండు వేర్వేరు గెటప్స్, మేకప్స్ లో దర్శనమిచ్చాడు.
టీజర్ మొత్తం యాక్షన్ విజువల్స్ తో నిండిపోయింది. అంచనాలకు మించి వయొలెన్స్ జొప్పించిన దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హింసను ప్రెజెంట్ చేసిన తీరు వెబ్ సిరీస్ లను మించిపోయేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, స్టంట్స్, బీజీఎమ్ ఒకదానితో మరొకటి పోటీ పడిన టాక్సిక్ అంచనాలు రేపడంలో సక్సెస్ అయ్యింది.
కెజిఎఫ్ ఫ్లేవర్ కొంత ఉన్నప్పటికీ అండర్ వరల్డ్ ని చాలా డెప్త్ గా చూపించబోతున్న క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే టాక్సిక్ చెప్పిన డేట్ ప్రకారమే మార్చి 19 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పుడే ఎలా ఉంటే ట్రైలర్ లో ఇంకేమేం రివీల్ చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates