ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని తెలిసిందే. తన భార్య స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ, అప్పుడప్పుడు ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలలో ముఖ్యంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు సాయిలు కంపాటి చెప్పిన మాటలను బన్నీ హైలెట్ చేయడం విశేషం. ఒక మధ్యతరగతి అబ్బాయి జీవితంలో తోడుగా ఉండే అమ్మాయి గురించి గతంలో అతను చెప్పిన మాటలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. “మన దగ్గర డబ్బులు లేకపోయినా, పండగకి బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నా.. నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం” అని ఆయన చెప్పిన మాటలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ఆ వీడియో బాగా నచ్చినట్లు వీడియోను స్పెషల్ గా పోస్ట్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్‌గా బిజీగా ఉన్నా కూడా, లోకల్ కంటెంట్‌ని ఫాలో అవుతూ ఇలాంటి మంచి మాటలను షేర్ చేయడం బన్నీ స్పెషాలిటీ అని చెప్పాలి. ప్రేమ అంటే కేవలం గిఫ్టులు ఇచ్చుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుండటమే అసలైన ప్రేమ అని ఈ వీడియో సందేశం ఇస్తోంది. ముఖ్యంగా నేటి తరం యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ మాటలు ఉండటంతో నెటిజన్లు కూడా వీటిని తెగ షేర్ చేస్తున్నారు.
మరొక వీడియోలో “ప్రేమ అనేది ఎదుటివారిని ప్రేమించడమే కాదు, వారు తమను తాము ప్రేమించుకునేలా చేయడమే అత్యున్నతమైన ప్రేమ” అనే లోతైన అర్థాన్ని బన్నీ షేర్ చేశారు. అలాగే ఒక ఇంగ్లీష్ కోట్ ఉన్న వీడియోను షేర్ చేస్తూ..
“చనిపోయిన తర్వాత పూలు ఇవ్వడం కాదు, నేను ఉన్నప్పుడే ప్రేమను చూపించండి” అనే అర్థం వచ్చేలా ‘లవ్ మీ టుడే’ అని క్యాప్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వాలెంటైన్స్ డే పోస్టులు చాలా సింపుల్‌గా ఉన్నా, వాటిలో ఉన్న అర్థం మాత్రం చాలా గొప్పగా ఉంది. తన ఫాలోవర్స్ అందరికీ వాలెంటైన్స్ డే విషెస్ చెబుతూనే, ప్రేమలోని అసలైన విలువలను గుర్తు చేశారు మన స్టైలిష్ స్టార్.

Gulte Telugu Telugu Political and Movie News Updates