ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో కొత్త ఒరవడికి చుట్టిన దృశ్యం ఫ్రాంచైజ్ లో చివరి భాగం మలయాళంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. మోహన్ లాల్ సహకారంతో జీతూ జోసెఫ్ చకచకా గుమ్మడికాయ కొట్టేశారు. వేసవి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి.
వేరే కథతో అజయ్ దేవగన్ హిందీ దృశ్యం 3 అక్టోబర్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. కానీ తెలుగులో ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేక అభిమానులు కన్ఫ్యూజవుతున్నారు. ఎందుకంటే అసలు షూట్ మొదలుపెట్టేనాటికే మలయాళం దృశ్యం 3 ఓటిటిలో వచ్చేలా ఉంది. దీంతో ట్విస్టులన్నీ స్పాయిలర్స్ గా బయటికి వస్తాయి.
ఈ రిస్క్ ఉండకూడదనుకుంటే వెంకటేష్ వెంటనే దృశ్యం 3 మొదలుపెట్టాలి. కానీ ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆదర్శ కుటుంబం చిత్రీకరణ పద్ధతి ప్రకారం జరిగిపోతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలనే లక్ష్యంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారని సమాచారం.
ఆలోగా అనిల్ రావిపూడితో వెంకటేష్ నాలుగోసారి జట్టు కట్టబోతున్నారు. ఇది 2027 సంక్రాంతి రిలీజ్ కాబట్టి నాలుగైదు నెలలు వెంకటేష్ ని ఎవరికీ ఇవ్వకుండా లాక్ చేసుకుంటాడు రావిపూడి. అలాంటప్పుడు దృశ్యం 3కి స్లాట్ ఎక్కడ ఖాళీ ఉంది. సో తెరకెక్కే అవకాశాలు మెల్లగా తగ్గిపోవచ్చు. ఫాన్స్ టెన్షన్ అదే.
పరిస్థితి చూస్తుంటే అదే జరిగేలా ఉంది. నిర్మాత సురేష్ బాబు మాత్రం దృశ్యం 3 పట్ల సానుకూలంగానే ఉన్నారట. ఎందుకంటే ముగింపు కాబట్టి రాంబాబు స్టోరీ సంపూర్ణంగా చెబితేనే మోహన్ లాల్ తో పాటు వెంకీ ఫిల్మోగ్రఫీలో దీని స్థానం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
వెంకటేష్ మనసులో ఏముందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. దృశ్యం 3లో ఈసారి ట్విస్టుల కన్నా ఎక్కువగా ఎమోషన్లు ఉంటాయట. ఎండింగ్ చాలా డెప్త్ గా ఉంటుందని కోచి వర్గాల కథనం. మరి వాటిని అద్భుతంగా పండించే వెంకటేష్ ని రాంబాబు క్యారెక్టర్ లో మిస్ కావడం మూవీ లవర్స్ కి లోటేగా. చూడాలి ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates