హిట్లలో ఉన్నప్పుడు ఆఫర్లు రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఫెయిల్యూర్స్ లో ఛాన్సులు కొట్టేయడం అంత చిన్న విషయం కాదు. నవీన్ చంద్ర ప్రస్తుతం ఈ ఫేజ్ లోనే ఉన్నాడు. ఒకపక్క క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ గా కొనసాగుతుండగా ఇంకోవైపు సోలో హీరోగా తన మీద ఆధారపడి సినిమాలు తీసే దర్శక నిర్మాతలు వస్తూనే ఉన్నారు.
ఎటొచ్చి సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా మారిపోయింది. మొన్న శుక్రవారం విడుదలైన హానీని ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఒక డిఫరెంట్ హారర్ సబ్జెక్టు టచ్ చేసినప్పటికీ దర్శకుడు కరుణ కుమార్ పూర్తి సంతృప్తి కలిగేలా కథా కథనాలు రాయకపోవడంతో రెస్పాన్స్ అంతగా లేదు.
గత ఏడాది కూడా నవీన్ చంద్ర లీడ్ రోల్ చేసిన మూవీస్ బాగానే వచ్చాయి. లెవెన్ కు చూడొచ్చనే ఫీడ్ బ్యాక్ వచ్చినా థియేట్రికల్ గా పే చేయలేదు. షో టైం, బ్లైండ్ స్పాట్, 28 డిగ్రీస్ సెల్సియస్ నిరాశ పరిచాయి. రవితేజ మాస్ జాతరలో ఊర నాటు విలన్ గా కొత్త అవతారం ఎత్తితే అదేమో డిజాస్టర్ అయ్యింది.
గేమ్ ఛేంజర్ లో సపోర్టింగ్ రోల్ చేస్తే దానిదీ అదే రిజల్ట్. అంతకు ముందు మంత్ అఫ్ మధు, తగ్గేదేలే మొదలైనవన్నీ కనీసం ఊసులో లేకుండా వెళ్ళిపోయిన ఫ్లాపులు. నిజానికి నవీన్ చంద్ర కష్టంలో ఎలాంటి లోపం లేదు. ఎటొచ్చి జనాలతో టికెట్ కొనేలా చేసుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు.
కాకపోతే ఎలాంటి పాత్రకైనా ఎస్ చెబుతున్నాడు కాబట్టి ఏదో ఒక టైంలో బ్రేక్ దొరికితే కెరీర్ మరింత ఊపందుకుంటుంది. జయాపజయాలు పక్కన పెడితే టాలీవుడ్ మోస్ట్ బిజీ ఆర్టిస్టుల్లో అయితే నవీన్ చంద్ర ఉన్నాడు. అంత సులభంగా డేట్లు దొరకడం లేదట.
ఒకప్పుడు అందాల రాక్షసితో తన ఉనికిని చాటుకున్న నవీన్ చంద్రకు ఆ తర్వాత బోలెడు సినిమాలు వచ్చాయి కానీ ఏదీ గుర్తుండిపోయే స్థాయిలో ఆడలేదు. నా సినిమాలకు రండని రిక్వెస్ట్ చేస్తున్న ఈ ప్రామిసింగ్ ఆర్టిస్టుకు బ్రేక్ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణమంటే మాటలు కాదుగా.
Gulte Telugu Telugu Political and Movie News Updates