సంక్రాంతి బరిలో సోగ్గాడు… మారనున్న ఆట

అనుకోకుండా పిడుగు పడినట్టు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సోగ్గాడే సీక్వెల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. నేరుగా టైటిల్ చెప్పకపోయినా క్యాప్షన్ ని బట్టి అదే అని అర్థమవుతోంది. అయితే ఈసారి నాగార్జున ఒంటరిగా రావడం లేదు. బంగార్రాజులో నాగచైతన్యని తెచ్చినట్టు ఈసారి ఈ ఇద్దరితో పాటు అఖిల్ కూడా ఉంటాడని లేటెస్ట్ అప్డేట్.

ఇలాంటివి ఒక్కసారిగా టీమ్ రివీల్ చేయలేదు కాబట్టి సందర్భానికి తగ్గట్టు మెల్లగా ప్రకటనలు ఇవ్వబోతోంది. 2022లో బంగార్రాజు తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ వచ్చేసింది. అక్కినేని అభిమానులు అప్పటి నుంచే కొనసాగింపు డిమాండ్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పటికి నెరవేరింది.

దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతని కంటే బాగా ఈ సబ్జెక్టుని వేరే వేళ్ళు హ్యాండిల్ చేయలేరు. పైగా చిరంజీవి మూవీ చేజారక పూర్తిగా నాగ్ మూవీ మీదే వర్క్ చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇదంతా బాగానే ఉంది కానీ నలుగురు సీనియర్ హీరోల క్లాష్ తో 2027 రసవత్తరంగా మారేలా ఉంది.

వెంకటేష్ – అనిల్ రావిపూడిల కాంబో నూరు శాతం వచ్చేస్తుంది. ఎలాంటి అనుమానం లేదు. చిరంజీవి – బాబీ కొల్లి, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలు సైతం పండగ బరినే టార్గెట్ చేసుకున్నాయి. కాకపోతే ఖచ్చితంగా మాట మీద ఉంటాయా లేదా అనేది గ్యారెంటీగా చెప్పలేం.

ఎందుకంటే సోగ్గాడే  సీక్వెల్ కి పెద్దగా రిస్క్ లేదు. వేగంగా పూర్తి చేయొచ్చు. వెంకీ సినిమాని రావిపూడి ఎంత వేగంగా ఫినిష్ చేస్తాడో చెప్పనక్కర్లేదు. ఎటొచ్చి చిరంజీవి, బాలయ్య సినిమాలు పెద్ద కాన్వాస్ కాబట్టి ఖచ్చితంగా మాట మీద ఉంటాయో లేదో చెప్పలేం. ఇప్పటికైతే ఈ నాలుగు సినిమాల్లో ఏదీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు.

వచ్చే నెల నుంచి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాయి. కానీ ముందస్తుగానే కర్చీఫ్ వేసేస్తున్నాయి. నాగ్ ఇంత కాన్ఫిడెంట్ గా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక సోగ్గాడు సెంటిమెంట్ ఒకటే కారణం కాదు డిస్ట్రిబ్యూషన్ పరంగా అన్నపూర్ణ ఆ టైంకంతా బాగా బలపడుతుంది.