గత ఏడాది లైలాతో చేదు ఫలితం చూసిన విశ్వక్ సేన్ దాని దెబ్బకు ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని బయట కనిపించకుండా పూర్తిగా ఫంకీకే అంకితమైపోయాడు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక మీడియా కెమెరా ముందుకు వచ్చాడు.
ప్రిన్స్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు అనుదీప్ ఈసారి ఎలాగైనా కంబ్యాక్ కావాలన్న కసితో మరోసారి ఫన్ బేస్డ్ సబ్జెక్టు రాసుకున్నారు. సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. లవర్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 విడుదల కానున్న ఫంకీ కథేంటో దాచకుండా ట్రైలర్ లో చూపించారు.
యువకుడైన కోమల్ (విశ్వక్ సేన్) టాలీవుడ్ దర్శకుడు కావాలనే ట్రయిల్స్ లో ఉంటాడు. లైఫ్ ని సరదాగా గడిపే ఇతని చుట్టూ అల్లరి తప్ప వేరొకటి ఉండదు. కోటి బడ్జెట్ అని చెప్పి నాలుగింతలు ఎక్కువ చేసి నిర్మాతను టెన్షన్ పెట్టడం ఇతని స్టైల్.
అలాంటి కోమల్ జీవితంలో ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్ గా ఉన్న అమ్మాయి (కయదు లోహర్) తో పరిచయం ప్రేమగా మారుతుంది. గొడవలు కొట్లాటలు లేకుండా సింపుల్ గా వెళ్లిపోతున్న కోమల్ కు డైరెక్టర్ కావాలన్న లక్ష్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు అనేది వచ్చే వారం తెరమీద చూసి తెలుసుకోవాలి.
అనుదీప్ మార్క్ డైలాగులతో ట్రైలర్ నింపేశారు. తన నుంచి యూత్ కోరుకునే ఎలిమెంట్స్ కి లోటు లేకుండా అన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డారు. హీరోయిన్ కయదు లోహర్ కొంచెం బొద్దుగా ఉన్నా ఆకట్టుకునేలా కనిపించడంతో పాటు పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చింది.
నరేష్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల అండతో అనుదీప్ మరోసారి నవ్వుల విందు పంచడం ఖాయంగా అనిపిస్తోంది. హైప్ పెంచడంలో టీమ్ వర్కౌట్ చేసుకుంది. ఫిబ్రవరి బోణీ నిరాశాజనకంగా మొదలవ్వడంతో బయ్యర్ వర్గాల ఆశలు ఫంకీ మీదే ఉన్నాయి. బాగుందనే టాక్ వస్తే ఈజీగా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టుకోవచ్చు. చూడాలి విశ్వక్ ఫ్లాపుల ప్రవాహానికి ఫంకీ ఎలా అడ్డుకట్ట వేయనుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
