డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున మారుతీ పేరే తలుస్తున్నారు అభిమానులు. ఎంతగా అంటే మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేసేంత. ఎస్కెఎన్ ఏకంగా పోలీస్ ఫిర్యాదు చేసేంత.
రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసినా ఆ ఆనందం ఎవరికీ మిగల్లేదంటే రాజా సాబ్ ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మూవీ నెల తిరక్కుండానే ఓటిటిలో వచ్చేసింది. ఏదో ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో సదరు ఓటిటి సంస్థ విపరీతమైన ప్రమోషన్లు చేస్తోంది. వెరైటీ పబ్లిసిటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదంతా బాగానే ఉంది కానీ రాజా సాబ్ ఇప్పుడు హెచ్డి, 4కె వెర్షన్లలో వచ్చాక మళ్ళీ టార్గెట్ అవుతుందా లేక డార్లింగ్ ఫ్యాన్స్ ఇక్కడితో వదిలేస్తారా అనేది వేచి చూడాలి. వాళ్ళు లైట్ తీసుకున్నా హిందీ, తమిళ జనాలు ఊరుకునేలా లేరు. స్క్రీన్ షాట్లు, వీడియోలు పట్టుకొచ్చి ఎగతాళి చేసినా ఆశ్చర్యం లేదు.
రాజా సాబ్ కనక ఒక మాములు కమర్షియల్ మూవీ అయితే ఇంత డిస్కషన్ అవసరం ఉండేది కాదు. కానీ భారీ విఎఫ్ఎక్స్ తో నాలుగు వందల కోట్ల బడ్జెట్ అంటూ ఘనంగా ప్రమోట్ చేసుకుని వచ్చింది. అందుకే జనాలు అంత నిరాశకు గురయ్యారు. తమ నిరసనను వివిధ రూపాల్లో ప్రదర్శించారు.
రిజల్ట్ సంగతి కాసేపు పక్కనపెడితే రాజా సాబ్ ని చూడని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చే అవకాశాలు బోలెడు. వాళ్ళు నెగటివ్ గా రెస్పాండ్ అవుతారావు లేక పాజిటివ్ గా చెబుతారానేది తర్వాత సంగతి.
ముందైతే ప్రభాస్ సినిమా కాబట్టి ఒక షో వేసే తీరాలని డిసైడ్ అవుతారు. ఇది ఓటిటికి వ్యూస్ పరంగా కనకవర్షం కురిపించే పాయింట్. డైవర్ట్ కావడానికి ఈ వారం వేరే చెప్పుకోదగ్గ ఓటిటి రిలీజులు ఏవీ లేవు. సో అందరూ రాజా సాబ్ మీదే ఉంటారు. ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ టెండెడ్ వర్షన్ అంటున్నారు కాబట్టి థియేటర్లకు కట్ చేసిన సీన్స్ ఏమైనా ఉంటాయేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates