గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి ఉంది. అయితే ఎనిమిదికి పైగా కొత్త రిలీజులు ఉన్నా దానికి తగ్గ సౌండ్ సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ప్రధాన కారణం మెయిన్ లీగ్ ఆర్టిస్టులు నటించిన మూవీస్ ఏవీ లిస్టులో లేకపోవడమే.

కంటెంట్ నమ్ముకుని పబ్లిక్ టాక్స్, రివ్యూస్ తో మెప్పిస్తామనే కాన్ఫిడెన్స్ తో మీడియం, చిన్న నిర్మాతలు పెద్ద ధైర్యమే చేస్తున్నారు. చూసేందుకు గంపెడు కనిపిస్తున్నాయి కానీ వాటి మీద అంచనాలు మాత్రం గుప్పెడే ఉన్నాయి. ఇవి పెరగాలంటే యునానిమస్ కాకపోయినా చూడొచ్చనే టాక్ తెచ్చుకుంటే చాలు.

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ ‘యూఫోరియా’తో వస్తున్నారు. దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ని హైలైట్ చేస్తూ ప్రమోషన్ కానిస్తున్నారు కానీ ఇంత సీరియస్ కాన్సెప్ట్ జనాలకు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి. అయితే మాత్రం హిట్టు ఖాయం.

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ డ్రామా ‘హనీ’ మీద హైప్ రావాలంటే ప్రీమియర్లు అవ్వాల్సిందే. యూత్ ని టార్గెట్ చేసుకున్న తమిళ డబ్బింగ్ ‘విత్ లవ్’ కొంచెం ప్రామిసింగ్ గానే ఉంది. వెరైటీ పబ్లిసిటీ ట్రై చేస్తున్న ‘శ్రీ చిదంబరం గారు’ బజ్ పెంచుకునేందుకు కష్టపడుతున్న వైనం ఆన్ లైన్ లో చూడొచ్చు.

పబ్లిక్ స్టేజి మీద హీరో బూతు పాట పాడటం ద్వారా అటెన్షన్ తెచ్చుకున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ మీద అంచనాలు లేవు కానీ సర్ప్రైజ్ ఏమైనా ఉందేమో చూడాలి. రవితేజ వీడియో బైట్ ఇచ్చిన ‘సుమతి శతకం’తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులతో తీసిన ‘ఎర్రచీర’ రేపే రాబోతున్నాయి.

విచిత్రం ఏంటంటే ఈ సినిమాలన్నిటి కన్నా రీ రిలీజ్ ‘ఆరెంజ్’కే అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ధనుష్ ‘3’కి కూడా నెంబర్లు కనిపిస్తున్నాయి. జనాలు లేక థియేటర్లు బోసిపోతున్న టైంలో వీటిలో ఏవి ఆక్సీజెన్ గా నిలబడతాయో చూడాలి. వీకెండ్ ని క్యాష్ చేసుకోవాలంటే జనాన్ని రప్పించడమే కాదు వాళ్ళను మెప్పించడం ఈ సినిమాలకు చాలా కీలకం.