అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి 1. కానీ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. 12ఏ రైల్వేకాలనీ డిజాస్టర్ అయ్యాక అల్లరోడి మార్కెట్ దారుణంగా డ్యామేజయ్యింది.
అంతకు ముందు కూడా ఫ్లాపులు ఉన్నప్పటికీ మినిమమ్ ఓపెనింగ్స్ ఉన్న హీరో నుంచి ఇప్పుడు కొన్ని చోట్ల డే వన్ డెఫిషిట్లు నమోదు చేసే స్థాయికి పడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రభావం నేరుగా ఆల్కహాల్ మీద పడినట్టు ఉంది. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ కు జిబ్రాన్ సంగీతం అందించారు.
రుహానీ శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసింది చిన్నా చితక సంస్థ కాదు. మంచి ఊపు మీదున్న సితార ఎంటర్ టైన్మెంట్స్. ఈ ఏడాది నెలకో హిట్ ఇస్తానని శపథం చేసిన నిర్మాత నాగవంశీ దానికి తగ్గట్టుగానే జనవరిలో అనగనగా ఒక రాజుతో బోణీ చేశారు.
ఫిబ్రవరిలో ఫంకీ ఈ సెంటిమెంట్ ని బలపరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అటుపై కూడా లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ మధ్యలో ఆల్కహాల్ ఊసు వినిపించడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇదేమి విఎఫెక్స్ డిమాండ్ భారీ సబ్జెక్టు కాదు. షూటింగ్ అయిపోయింది కూడా.
అలాంటప్పుడు ఎందుకు పెండింగ్ పెట్టారనేది సస్పెన్స్ గానే ఉంది. అయినా ఇప్పటికిప్పుడు ఈ సినిమాని రిలీజ్ కు రెడీ చేసినా అమాంతం హైప్ వచ్చే అవకాశాలు తక్కువ. విపరీతమైన ప్రమోషన్లు చేయాలి. కంటెంట్ ని జనాలకు దగ్గరగా తీసుకెళ్లాలి. అసలు టైటిలే ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం పెట్టేలా ఉంది.
ఇన్ని ప్రతీకూలతల మధ్య పబ్లిసిటీ చేయడం సవాలే. అందుకే టీమ్ ఆగినట్టు కనిపిస్తోంది. అయినా ఏదో ఒక వైవిధ్యం లేనిదే సితార కాంపౌండ్ లోకి ఆల్కహాల్ ఎంటర్ కాదు. సో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. వీలైనంత త్వరగా మోక్షం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates